జోగులాంబ రేంజ్ డీఐజీ చౌహాన్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. డీఐజీ చౌహాన్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ కావడం పోలీస్ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల పోలీస్ శాఖలో కొందరు అధికారులు తమ తీరు మార్చుకోవాలని డీజీపీ హెచ్చరించిన విషయం చర్చనీయాంశంగా మారింది. నలుగురు అధికారులు చెప్పిన మాట వినడం లేదని, వారి ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఉందని డీజీపీ వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. ఆ హెచ్చరికలు చేసిన 24 గంటల్లోనే జోగులాంబ రేంజ్ డీఐజీపై చర్యలు ప్రారంభం కావడంతో.. డీజీపీ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కాలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు చౌహాన్‌పై గతంలో పలు ఆరోపణలు ఉన్నాయి.. ముఖ్యంగా అవినీతి వ్యవహారాలకు సంబంధించి ఫిర్యాదులు, ఆరోపణలు అధికార వర్గాల్లో చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై నిజాలు విచారణలోనే తేలాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో డీఐజీని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రస్తుతం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు..
ఇదే సమయంలో పోలీస్ శాఖలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నలుగురు డీఎస్పీ స్థాయి అధికారులపై కూడా చర్యలు తీసుకునే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇక పోలీస్ శాఖలో అవినీతి ఆరోపణలు, అధికారుల పనితీరు, క్రమశిక్షణపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
మరోవైపు డీఐజీ చౌహాన్‌పై తీసుకున్న చర్యలతో వ్యవహారం ఇక్కడితో ఆగుతుందా? లేక తదుపరి టార్గెట్‌గా మిగతా వారు మారబోతున్నారా? పోలీస్ శాఖలో ముందుముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది.












