తెలంగాణ

Telangana High Court: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే.. బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

రచన: NK••3 నిమిషాల పఠనం

Telangana High Court: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ పథకాలపై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చెల్లింపులు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Telangana High Court: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ పథకాలపై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చెల్లింపులు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చట్టసభల్లో ఎలాంటి తీర్మానం లేదా ప్రత్యేక చట్టం చేయకుండానే కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా మాత్రమే ఈ స్కీమ్స్ అమలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో స్టే విధించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఇప్పటికే 4 వారాల సమయం ఇచ్చింది. అయితే, గడువు ముగిసినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా మరింత సమయం కావాలని కోర్టును కోరింది. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చిన హైకోర్టు. అప్పటివరకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై స్టే విధించింది.

ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రేవంత్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పథకాల అమలును నిలిపివేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కౌంటర్ దాఖలులో జాప్యం చేసిందని వారు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 9న జరగనుంది. ఆ రోజునైనా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తుందా? కోర్టు తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#Telangana High Court#Telangana Govt#Kalyana Lakshmi#Shaadi Mubarak#Schemes#Stay#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి