National

Tata Chandrasekaran: టాటా గ్రూప్‌కి బిగ్ షాక్.. చంద్రశేఖరన్ రాజీనామా.. కారణం అతడేనా?

రచన: NK••4 నిమిషాల పఠనం

Tata Chandrasekaran: టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేసేశారు. ఈ నెల 18న జనరల్ బాడీ మీటింగ్ ఉంది. దానికి ముందే చంద్రశేఖర్ తీసుకున్న రాజీనామా నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. 2017లో టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన పదవీ కాలం 2027 ఫిబ్రవరి 20న ముగియనుంది.

Tata Chandrasekaran: టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేసేశారు. ఈ నెల 18న జనరల్ బాడీ మీటింగ్ ఉంది. దానికి ముందే చంద్రశేఖర్ తీసుకున్న రాజీనామా నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. 2017లో టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన పదవీ కాలం 2027 ఫిబ్రవరి 20న ముగియనుంది.

63 ఏళ్ల చంద్రశేఖరన్‌ 1987లో టాటా గ్రూప్‌‌లో చేరారు. 2009లో టీసీఎస్‌ సీఈఓగా నియమితులయ్యారు. 2017లో టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. రెండోసారి కూడా 2022లో ఆయనే నియమితులయ్యారు. టీసీఎస్, టాటా మోటార్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటి పలు టాటా గ్రూప్ కంపెనీలకు కూడా చంద్రశేఖర్ ఛైర్మన్‌గా ఉన్నారు.

నోయల్ టాటాతో విభేదాలు..

దాదాపు దశాబ్దం నుంచి టాటా సన్స్ కు చంద్రశేఖరన్ చైర్మన్ గా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అనూహ్యంగా రిజైన్ చేయడం సెన్సేషనల్ గా మారింది. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఈ క్రమంలో టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయల్ టాటా పేరు తెరమీదకు వచ్చింది. ఆయనతో ఉన్న విభేదాలే చంద్రశేఖరన్ రాజీనామాకు ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో తన టర్మ్ పొడిగింపును ఒక టాటా ట్రస్ట్స్ బోర్డు సభ్యుడు వ్యతిరేకించారని చంద్రశేఖర్ చెప్పారు. టాటా సన్స్ ను స్టాక్స్ లోకి తేవద్దన్న నోయల్ కండీషన్ కు చంద్రశేఖరన్ ఒప్పుకోలేదని తెలుస్తోంది.

కొత్త బాస్ ఎవరు?

చంద్రశేఖరన్ తమిళనాడులో రైతు కుటుంబంలో జన్మించారు. టాటాతో 40ఏళ్ల అనుబంధాన్ని కలిగున్నారాయన. ఇండియాలో అత్యధిక జీతం తీసుకుంటున్న కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ లో చంద్రశేఖరన్ ఒకరు. గత ఐదేళ్లలో దాదాపు 685 కోట్ల రూపాయలు జీతంగా తీసుకున్నారు. ఆయన ఆస్తుల విలువ 950 కోట్ల రూపాయల నుంచి 1400 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. మరోవైపు టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖర్ చేసిన రాజీనామా.. టాటా గ్రూప్ షేర్లను షేక్ చేసింది. ఆయన రాజీనామాతో టాటా గ్రూప్ షేర్లు పతనం అయ్యాయి. ఇక చంద్రశేఖరన్ రాజీనామాతో టాటా సన్స్ కొత్త బాస్ ఎవరు అనేది ఇంట్రస్టింగ్ మారింది. నోయల్ టాటా, ఆయన పిల్లలు నెవిల్లే(టాటా ట్రెంట్ ఎండీ), లియా (IHCL వైస్ ప్రెసిడెంట్), మాయా(టాటా న్యూ) పేర్లు చైర్మన్ పదవి రేసులో వినిపిస్తున్నాయి.

#Chandrasekaran#Tata#Tata Sons#Tata Sons Chairman Resign#Noel Tata
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి