NTR: ఎన్టీఆర్ కి నేడు సికింద్రాబాద్ లోని కింస్ హాస్పిటల్‌లో సర్జరీ పూర్తైంది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్‌లో భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డాక్టర్లు పరీక్షలు నిర్వహించి సర్జరీ అవసరమని చెప్పారు. దీనికి, సంబందించి నిన్న(ఆగస్టు 11) ప్రెస్‌నోట్ ద్వారా ఆగస్టు 12న సర్జరీ చేయించుకోనున్నట్టుగా తెలిపారు. అలాగే, ఎన్టీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మరో, 3 నెలలపాటు తారక్ రెస్ట్ తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ అనే భారీ యాక్షన్ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ కి జతగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తోంది. భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్న సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయం అయింది. దీంతో, ఇప్పట్లో షూటింగ్‌లో పాల్గొనడానికి అవకాశం లేదు. తాజాగా, హెల్త్ బులిటెన్ విడుదల చేసిన డాక్టర్లు..2 నుంచి 3 నెలల పాటు రెస్ట్ అవసరమని చెప్పారు.

ఇక, సర్జరీ విజయవంత అయిందని, ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని, పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్స్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. 2 నెలల తర్వాత మళ్ళీ, అన్నీ పరీక్షలు నిర్వహించి భుజానికి అయిన గాయం పూర్తిగా తగ్గిందా లేదా వెల్లడిస్తామని తెలిపారు. తారక్ కి సర్జరీ విజయవంతం అయిన నేపథ్యంలో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, దాదాపు ఎన్టీఆర్ 3 నెలల వరకూ డేట్స్ మిస్ అవడంతో ఇటు డ్రాగన్ షూటింగ్ షెడ్యూల్స్ గాని, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయాల్సిన గాడ్ ఆఫ్ వార్ మూవీ ప్లానింగ్స్ గానీ, అన్నీ మారిపోతున్నాయి. డ్రాగన్ పూర్తైయ్యాకే గురూజి సినిమా పనులు మొదలవనున్నాయి. ఎంత కాదన్నా ఏడాది కొత్త ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ కానుంది.












