తెలంగాణ

Indiramma Housing Towers: లక్ష ఇళ్లు.. ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు రేపే భూమిపూజ

రచన: NK••4 నిమిషాల పఠనం

Indiramma Housing Towers: ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు రేపు భూమి పూజ జరగబోతోంది. హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఈ ప్లాట్లను నిర్మించబోతున్నారు. క్యూర్ పరిధిలో 12వేల ప్లాట్లతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు.

Indiramma Housing Towers: ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు రేపు భూమి పూజ జరగబోతోంది. హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఈ ప్లాట్లను నిర్మించబోతున్నారు. క్యూర్ పరిధిలో 12వేల ప్లాట్లతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు. తొలి విడతలో 18 ప్రాంతాల్లో 7 వేల 340 ప్లాట్ల నిర్మించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.807 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది సర్కార్.

హైదరాబాద్ నివాసం ఉంటున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు ఇవ్వాలన్న ఆలోచనతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రేవంత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు భూమి పూజ జరగనుంది. ఇళ్ల కేటాయింపునకు సంబంధించి రిజర్వేషన్లు అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎస్సీలకు 14శాతం, ఎస్టీలకు 5శాతం, బీసీలకు 16శాతం, దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆలోచనలో ఉంది.

హైదరాబాద్ మహా నగరంలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతిల్లు ఒక కల లాంటిది. ఆ కలను సాకారం చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. నగరంలోనే అత్యంత రద్దీ, ఖరీదైన ప్రాంతాలలో ఒకటి కేపీహెచ్‌బీ. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి సర్కార్ శ్రీకారం చుడుతోంది. కేపీహెచ్‌బీలోని మలేషియన్ టౌన్‌షిప్ ఎదురుగా ఉన్న తెలంగాణ హౌసింగ్ బోర్డుకు చెందిన ఖరీదైన స్థలంలో ఈ భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. అత్యంత డిమాండ్ ఉన్న ప్రైమ్ లొకేషన్‌లో పేదల కోసం ఇళ్లను నిర్మిస్తుండటం విశేషం.

5.87 ఎకరాల విశాలమైన విస్తీర్ణం

రెండు విడతల్లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం

ఫేజ్‌-1 లో 480 ఇళ్లు

ఫేజ్‌-2 లో 600 ఇళ్లు

మొత్తంగా 1,080 కుటుంబాలకు నివాసం

ఒక్కో భవన నిర్మాణానికి రూ. 10.80 కోట్లు

నాలుగు టవర్లకు రూ. 43 కోట్ల మేర నిధులు

#Indiramma Housing Towers#Hyderabad#Cure#Telangana#Cm Revanth Reddy#Indiramma Illu#KPHB Colony#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి