మూడు రోజులపాటు రొటీన్‌కు భిన్నంగా మీటింగ్స్
సీఎం అనుమతి లేకుండానే నామినేటేడ్ పదవుల్లో పేర్ల మార్పులు?
పాతవారిలో చాలా మందికి ఛాన్స్ లేదని చెప్పిన అధిష్టానం?
సడెన్‌గా మారిన వైఖరితో షాక్‌లో రేవంత్ రెడ్డి టీం?
మంత్రివర్గ విస్తరణ చేస్తే అసంతృప్తుల బుజ్జగింపుపై మల్లగుల్లాలు?
సింగిల్ నేమ్ ఎజెండాతో పార్టీ నడవద్దని చెప్పడంతో మరింత కన్ఫ్యూజన్?
భట్టిని, ఉత్తమ్‌ను నమ్మి తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం చేయలేమనే భావనలో ఢిల్లీ పెద్దలు?
కొద్ది రోజుల్లోనే మారింది ఏంటి?.. రాబోయే రోజుల్లో ఏం జరగనుంది?
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల మీటింగ్స్‌పై ఎక్స్‌క్లూజివ్
రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి మార్క్ పాలన సక్సెస్‌గా కొనసాగింది. ఆయన ఎవరెవరిని ఎలా మెయింటైన్ చేయాలో అలానే కొనసాగించారు. అల్ ఆఫ్ సడన్‌గా సీఎం వ్యక్తిగత పేరును కాకుండా పార్టీ పేరుగా వ్యవస్థను నడిపించేందుకు కసరత్తు మొదలైంది. అందుకు సంస్థగతంగా బలోపేతం చేయాల్సిన నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ అధిష్టానం చెప్పిన పేర్లనే ఫైనల్ చేయాల్సిందిగా సీఎంని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఇన్నాళ్లు రేవంత్ రెడ్డినే అన్ని ఫైనల్ అంటూ నమ్ముకుని పని చేస్తున్న వారికి చెక్ పెట్టేలా అధిష్టానం ఆలోచించడం ఆయన వర్గాన్ని కలవరపెడుతోంది. రెండేళ్లుగా నామినేటెడ్ పదవుల్లో పని చేసిన వారికి కాకుండా కొత్త వారికి అది తాము సూచించిన వారికే ఇవ్వాలని కొత్త లిస్ట్ ముందు పెట్టడంపై తెలంగాణ రాజకీయాలు అర్ధం చేసుకోలేరని రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలా కొనసాగితే రాబోయే ఎమ్మెల్యే టికెట్స్ కూడా ఇప్పించుకునేది కష్టంగా ఉంటుందని రెండో రోజు కూడా ఆందోళనలోనే మీటింగ్ కొనసాగినట్లు తెలుస్తోంది.
చెక్ అండ్ బ్యాలెన్స్‌గా లేని అసలు కాంగ్రెస్ నేతలు?
పార్టీలో నాయకులు అతి ప్రజాస్వామ్యంగా మాట్లాడితేనే తమకు మంచిదని భావిస్తుంది ఢిల్లీ కాంగ్రెస్. అందుకు నేతల్లో పోటీ వాతవరణం కొనసాగించేలా చేస్తుంది. అందుకే సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్కకు డిఫ్యూటీ సీఎం హోదా ఇచ్చి పార్టీకి విధేయుడిగా పని చేయాలని కోరుకున్నారు. కానీ, ఏ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కాదని పోలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీలో కీలక రోల్ పోషించేవారు. ఆయన పార్టీలో, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉండేది. కానీ, ఏ పని కావాలన్నా అంతా సీఎం గారే అన్నట్లుగా వ్యవహరించడంతో కాంగ్రెస్ పార్టీ కోరుకున్న విధంగా ప్రభుత్వం నుంచి చెక్ అండ్ బ్యాలెన్స్‌గా సమాచారం, పోటీతత్వం లేని వైఖరిని పార్టీ గుర్తించినట్లు సమాచారం. దీంతో మూడు రోజుల మీటింగ్‌లో సంస్థాగత నిర్ణయాలు, ఎస్ఐఆర్ నమోదుతో పాటు, అనేక అంశాలు చర్చకు తెచ్చారని తెలుస్తోంది. ఒక్కొక్క వైఖరిపై అలా తీసుకోకుండా ఉంటే ఇలా మేలు జరిగేదనే భావన కల్గించేలా రిపోర్టులు అధిష్టానం వద్ద ఉండడంపై సీఎం రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేక పోయారని సమాచారం.
మంత్రి పదవుల భర్తీపై వంతులు?.. ఆగస్ట్ 15 తర్వాత ఫుల్ క్యాబినెట్
ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేసేలా అధిష్టానం వద్ద ఒత్తిడి పెరుగుతోంది. కానీ, ఆ నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకుని ఆశావహులను బుజ్జగించే బాధ్యత అప్పగించారు. ఇప్పటికే హామీలు ఇచ్చి మాట నిలుపుకోలేకపోతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఆగస్ట్ 15 తర్వాత ఏ క్షణమైనా క్యాబినెట్ విస్తరణ చేయాల్సిందేనని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొత్తానికి సీఎం అనుకున్నట్లు ఢిల్లీ యువ జెన్ జీ పాలిటిక్స్‌పై పెద్దగా చర్చ జరగలేదు.
దేవేందర రెడ్డి చింతకుంట్ల.
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్,
9848070809












