స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Shamirpet Land Scam: శామీర్ పేట్‌లో 10వేల కోట్ల భూ స్కామ్ కంటిన్యూ?

రచన: Swechaanews Chairman6 నిమిషాల పఠనం

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్‌లో భారీ భూ కుంభకోణం కాంగ్రెస్‌ పాలనలో కొనసాగుతోంది. బీఆర్ఎస్‌లో ఓ ఎమ్మెల్సీ వేసిన స్కెచ్‌ను ఈనాటి ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోంది. కోట్లాది రూపాయలు కొట్టేయ్యొచ్చు అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి ఆనాడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి రాసిన లేఖను, ఆనాటి ధరణికి, ఈనాటి భూభారతి స్కెచ్‌కు తేడా ఏటో ఎవరికీ చెప్పుకోలేక పేపర్‌లో డిమాండ్‌గా డిటెయిల్స్ నోట్ యాడ్స్‌గా వేడుకుంటున్నారు.

  • బొమ్మరాసిపేటలో వెయ్యి ఎకరాలపై మొదలైన కుట్రలు

  • అప్పుడు ధరణి పేరుతో బీఆర్ఎస్ నేతల అత్యాశ?

  • ఇప్పుడు భూభారతి పేరుతో కోట్లు కొల్లగొట్టొచ్చు అంటూ ప్లాన్?

  • సూత్రధారులు రాజీకీయ నాయకులు, పాత్రధారులు రియల్ బ్రోకర్స్

  • ఆనాడు ఎంపీగా రేవంత్ రెడ్డి ఏమన్నారు?

  • ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఏం చేయిస్తున్నారు?

  • పట్టాదారులకు తెలియకుండానే రికార్డుల్లో పేర్లు మారుతున్న తీరుపై స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ

శామీర్ పేట్‌లో మారుతున్న రెవెన్యూ శాసనాలు?

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్‌లో భారీ భూ కుంభకోణం కాంగ్రెస్‌ పాలనలో కొనసాగుతోంది. బీఆర్ఎస్‌లో ఓ ఎమ్మెల్సీ వేసిన స్కెచ్‌ను ఈనాటి ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోంది. కోట్లాది రూపాయలు కొట్టేయ్యొచ్చు అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి ఆనాడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి రాసిన లేఖను, ఆనాటి ధరణికి, ఈనాటి భూభారతి స్కెచ్‌కు తేడా ఏటో ఎవరికీ చెప్పుకోలేక పేపర్‌లో డిమాండ్‌గా డిటెయిల్స్ నోట్ యాడ్స్‌గా వేడుకుంటున్నారు. లేని ఫైల్‌ చుట్టూ ఆనాటి కలెక్టర్ అమోయ్ కుమార్ చేసిన దందాను ఈనాటి కలెక్టర్ మను చౌదరి కొనసాగిస్తున్నారు. 20 రోజుల క్రితం 20 ఎకరాల వరకు పాత పట్టాదారులకు తెలియకుండానే కొత్తగా పట్టా పాసుబుక్‌లు ఇచ్చారు. రూల్స్ ఏంటి అంటే కోర్టు కేసుల కింద వాళ్లు అనుకున్న వాళ్లకు వాటాలు తీసుకుని భూభారతి పాస్ బుక్స్ ఇస్తున్నారు. ఇదేంటి అని అడిగేందుకు భూభారతిలో 60 రోజుల అప్పీల్ వేయకుండానే కబ్జా కాలంలో కూడా ఉన్నట్లు రికార్డులు మారేటట్లు పకడ్బందీగా దోచుకుంటున్నారు.

అసలు హిస్టరీ ఇదే?

1965లో 21 మంది రైతులు వెయ్యి ఎకరాలను ఆనాటి రిజిస్ట్రర్ సేల్ డీడ్స్ ద్వారా కొనుగోలు చేశారు. అప్పటి నుంచి క్రయవిక్రయాలు జరిగాయి. ఇనామ్ ల్యాండ్స్‌కు ఓఆర్సీ ఇచ్చారు. 1973లో అమ్ముకున్నాం, సీలింగ్ ల్యాండ్స్ లేవని డిక్లరేషన్స్ ఇచ్చారు. 240 ఎకరాలకు ట్రిబునల్ 50 బీ సర్టిఫికేట్ కూడా వచ్చింది. సీలింగ్‌కు సైతం ఒప్పుకున్నారు. దుగ్గిరాల బలరామకృష్ణ కుటుంబం అన్నింటికీ రికార్డ్స్ ఒప్పుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు సమయంలో అందరికీ డబ్బులు కూడా పడ్డాయి. కానీ, ధరణి పేరుతో వచ్చిన బీఆర్ఎస్ భూ మాఫియాకు కొనుగోలుదారులు బలి అయ్యారు.

ఐటీసీ భూములపైనే మొదటి దాడి

ఈ ఇండస్ట్రీకి ఎప్పుడో కొనుగోలు చేసిన 70 ఎకరాల భూమి ఉంది. అందులో 50 ఎకరాలపై కన్ను పడింది. కంపెనీ కదా ఎవరు వస్తారులే అనుకుని క్లియర్ చేసుకున్నారు జీపీఏ హోల్డర్స్, వాళ్లను నమ్మి పెట్టుబడి పెట్టిన వారు. వాళ్ల పేర్లు కూడా స్వేచ్ఛయుతంగా ఇస్తున్నాం. వై రాజేశ్వరీ, దుగ్గిరాల విజయరాణి, చౌగోని జయమ్మ, దుగ్గిరాల లీలా యుగేందర్ బాబు, సామల ఆదిత్య, సంతాన్ రెడ్డి, మారుముల సూరేన్, కావేరి గారి వేంకటేశ్వర్ రెడ్డి వాళ్లు పేర్లు ఎక్కించుకుని కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.

స్వేచ్ఛ న్యూస్ వదలదు

బొమ్మరాసిపేట రెవెన్యూలో చక్రం తిప్పిన వెలమ దొరలు ఎవరు? ఎవరు ఎవరిని ఇన్వాల్వ్ చేశారు. ఇప్పటికీ వాళ్లను రక్షించుకునేందుకు చెప్పుకుంటున్న వాదన ఎంటి? ఏ2/2183, ఏ2/2138 అంటూ లేని లిటిగేషన్స్ ఎవరు సృష్టించినా స్వేచ్ఛ న్యూస్ వదలదు. ఇలాంటి చట్టాలు తెలియకుండా రిజిస్ట్రేషన్ అయితే చాలు అనుకుని కొనుగోలు చేసిన వారి తరుపున స్వేచ్ఛ న్యూస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి ఫైట్ చేస్తూనే ఉంటారు.

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, స్వేచ్ఛ చైర్మన్,
9848070809

#Shameerpet Land Scam#Medchal#Bommarasipet#Land Scam#Dharani#Bhu Bharati#Telangana Politics#Revenue Records#Land Mafia#Investigation News#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి