తెలంగాణ

RS Praveen Kumar: స్వేచ్ఛ సంచలన కథనంపై స్పందించిన బీఆర్ఎస్.. ''పెద్ది''పై ఒత్తిళ్లు నిజమేనన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రచన: NK7 నిమిషాల పఠనం

RS Praveen Kumar: ''పెద్ది'' పై ప్రెజర్ పెట్టింది ఎవరు? అంటూ స్వేచ్ఛలో వచ్చిన ఇన్వెస్టిగేషన్ కథనం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ ఇన్వెస్టిగేటివ్ కథనానికి విశేష స్పందన లభించింది. ఈ సంచలన కథనంపై బీఆర్ఎస్ స్పందించింది. స్వేచ్ఛ కథనంలో చెప్పినట్లుగానే పెద్ది సుదర్శన్ రెడ్డిపై రాజకీయ ఒత్తిళ్లు నిజమే అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.

* సంచలనంగా మారిన స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ కథనం

* స్వేచ్ఛ ఇన్వెస్టిగేటివ్ కథనానికి విశేష స్పందన

* పెద్ది పై ప్రెజర్ చేసింది ఎవరు? అనే కథనానికి బీఆర్ఎస్ స్పందన

* స్వేచ్ఛలో వచ్చిన కథనాలను చూపిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్

* పెద్ది పై ప్రెజర్ పెట్టింది ఎవరు? అనేదానిపై దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్

* పెద్దికి గుండెపోటు రావడానికి ఆర్థిక లావాదేవీలు, రాజకీయ ఒత్తిళ్లే కారణం అని ఆరోపణ

RS Praveen Kumar: ''పెద్ది'' పై ప్రెజర్ పెట్టింది ఎవరు? అంటూ స్వేచ్ఛలో వచ్చిన ఇన్వెస్టిగేషన్ కథనం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ ఇన్వెస్టిగేటివ్ కథనానికి విశేష స్పందన లభించింది. ఈ సంచలన కథనంపై బీఆర్ఎస్ స్పందించింది. స్వేచ్ఛ కథనంలో చెప్పినట్లుగానే బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై రాజకీయ ఒత్తిళ్లు నిజమే అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. స్వేచ్ఛలో వచ్చిన కథనం పేపర్లను ఆయన మీడియాకు చూపించారు. స్వేచ్ఛ కథనంలో చెప్పినట్లుగానే పెద్దిపై రాజకీయ ఒత్తిళ్లు నిజమేనని ఆయన వెల్లడించారు. ఎలాంటి చెడు అలవాట్లు లేకున్నా పెద్దికి హార్ట్ అటాక్ రావడానికి రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థిక లావాదేవీలే కారణం అని ఆర్ఎస్ ప్రవీణ్ సైతం ఆరోపించారు. గన్ లైసెన్స్‌తో పాటు రక్షణగా ఉండే గన్ మెన్స్‌ను తొలగించడం కూడా ఆయనన ఒత్తిడికి గురి చేసిందని, మానసికంగా ఇబ్బంది పెట్టిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అసలు ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అయినా గుండెపోటు రావడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ క్రమంలో పెద్దికి హార్ట్ అటాక్ రావడానికి దారితీసిన పరిస్థితులపై బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడానికి కారణమన్నారు. స్వేచ్ఛ కథనంలో రాసినట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడి ప్రమేయంతో ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని వెల్లడించారు. నర్సంపేటలో కొంతమంది వ్యాపారులు భూములు విక్రయించిన వ్యవహారంలో సీఎం సన్నిహితుడు ఆసక్తి చూపాడని, ఆ తర్వాత ఆ భూముల వ్యవహారంపై ఈఓడబ్ల్యూలో కేసులు నమోదు చేసి, సుదర్శన్ రెడ్డికి సన్నిహితులైన వ్యాపారులను విచారణ పేరుతో తీవ్రంగా వేధించారని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు.

ఈ కేసులో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరును చేర్చాలని ఒత్తిడి తెచ్చారని, ఆయన పలువురు అధికారులను సంప్రదించినా ఎలాంటి ఉపశమనం లభించలేదని వెల్లడించారు. గురుకుల బంకర్ బెడ్ల కొనుగోలు వ్యవహారం, సివిల్ సప్లయ్స్ లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధారాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించారని.. ఈ నేపథ్యంలోనే రూ.1,100 కోట్ల సివిల్ సప్లయ్స్ స్కామ్, స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలో బంకర్ బెడ్ల కొనుగోలు వ్యవహారంపై ఉన్నతాధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, హైకోర్టు, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ అంశాలే పెద్ది సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కారణం అయ్యాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

''కాంగ్రెస్ నేతల దోపిడీ, అవినీతిని ప్రశ్నించినందుకే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయుధ లైసెన్స్, సెక్యూరిటీ రద్దు చేశారు. అక్రమ కేసులతో వేధింపులకు గురి చేయడం వల్లనే మానసికంగా ఒత్తిడికి గురై హాస్పిటల్ లో ఈరోజు పోరాడుతున్నారు. నిజంగా సెక్యూరిటీ రివ్యూ కమిటీ పారదర్శకంగా పని చేస్తే జానారెడ్డి,

కొండా మురళి, జగ్గారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీకి చెందిన పసునూరి దయాకర్, ఆచార్యలకు సెక్యూరిటీ కొనసాగిస్తున్నారు? అనుముల తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, వరంగల్ లో రౌడీ షీటర్ గా పేరొందిన నవీన్ రాజ్, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ కి ఏ ప్రాతిపదికన సెక్యూరిటీ కల్పించారు డీజీపీ గారు?

నక్సలిజం లేదని తెలిసి, ఎలాంటి ముప్పు లేనపుడు రాష్ట్ర మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఎందుకు ఇస్తున్నారు? కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మంత్రులకు ఈ సౌకర్యాలు లేవు కదా. రాష్ట్ర హోంమంత్రి, డీజీపీలు నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేదా లోపభూయిష్టంగా పని చేస్తున్న సెక్యూరిటీ రివ్యూ కమిటీని రద్దు చేయాలి'' అని ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు.

https://x.com/RSPraveenSwaero/status/2082403472360808927

#RS Praveen Kumar#Swechaa News#Peddi Sudarshan Reddy#Brs#Congress#Telangana Politics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి