National

అమిత్‌షా టార్గెట్‌గా కాంగ్రెస్ గేమ్‌ప్లాన్.. రాహుల్ విమ‌ర్శ‌ల వెనుక కార‌ణాలేంటి..?

రచన: Kashi6 నిమిషాల పఠనం

ప్ర‌ధాని మోదీని ఏ స్థాయిలో టార్గెట్ చేస్తోందో.. అదే స్థాయిలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షానూ టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్. ఒక్కోసారి అంత‌కు మించి విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. యాంటీ పేప‌ర్ లీక్ బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ... అమిత్‌షాపైనా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

కాంగ్రెస్ స‌రికొత్త గేమ్‌ప్లాన్

అమిత్‌షా టార్గెట్‌గా రాహుల్ విమ‌ర్శ‌ల వెనుక వ్యూహం

అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్

స‌భ లోప‌ల‌, బ‌య‌ట అమిత్‌షాపై రాహుల్ విమ‌ర్శ‌ల వ‌ర్షం

జెన్ జీ ఉద్య‌మంలోకి కాస్త ఆల‌స్యంగా ఎంటరైన కాంగ్రెస్.. ఆ త‌ర్వాత మాత్రం స్పీడ్ పెంచింది. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసేదాకా ఢిల్లీని హోరెత్తించింది. ఆ ఎపిసోడ్ ముగిసిందో లేదో.. మ‌రో అంశాన్ని ఎత్తుకుంది. ఢిల్లీలో పార్ల‌మెంటు స‌మావేశాల తొలిరోజు జ‌రిగిన లాఠీఛార్జ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షానే కార‌ణ‌మ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ. పోలీసుల‌కు ఆదేశాలిచ్చింది ఆయ‌నే అంటూ విమ‌ర్శించారు. ఆ రోజు జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌కు బాధ్య‌త వ‌హిస్తూ రాజీనామా చేయాలంటూ అమిత్‌షాను డిమాండ్ చేశారు. ఉన్న‌ట్టుండి కాంగ్రెస్ ఎందుకు ఈ గేమ్ స్టార్ట్ చేసింది..? అమిత్‌షా టార్గెట్‌గా ఎందుకు విమ‌ర్శ‌లు చేస్తోంది..?

అమిత్‌షా టార్గెట్ వెనుక‌..?

ప్ర‌ధాని మోదీని ఏ స్థాయిలో టార్గెట్ చేస్తోందో.. అదే స్థాయిలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షానూ టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్. ఒక్కోసారి అంత‌కు మించి విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. యాంటీ పేప‌ర్ లీక్ బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ... అమిత్‌షాపైనా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. బ‌య‌ట మీడియా ముందు ఆయ‌న్నే టార్గెట్ చేశారు. ఢిల్లీలో జ‌రిగిన లాఠీఛార్జ్‌కు ఆదేశాలు ఇచ్చింది ఆయ‌నే అంటూ ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు చేశారు. దేశంలో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త హోంమంత్రిత్వ శాఖ కింద‌కే వ‌స్తుంది కాబ‌ట్టి.. అమిత్‌షా రాజీనామా చేయాల‌నేది రాహుల్ వాద‌న‌.

రాహుల్ గాంధీకి... అమిత్‌షాపై ఒక్కసారిగా కోపం వచ్చిందా..? లేక దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందా..? క‌చ్చితంగా రాజ‌కీయ వ్యూహ‌మే. ఎందుకంటే అమిత్‌షా కేవలం హోంమంత్రి మాత్రమే కాదు.

బీజేపీలో మోదీ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడు. పార్టీ అధ్యక్షుడిగా బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించింది ఆయనే. ఎన్నికల మేనేజ్‌మెంట్, అభ్యర్థుల ఎంపిక, కూటములు, వ్యూహాలు... ఇలా పార్టీ రాజకీయ యంత్రాంగానికి ప్రధాన ఆర్కిటెక్ట్‌గా అమిత్‌షాకు పేరుంది.

ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ లెక్కలు కూడా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. అమిత్‌షా విష‌యంలో దూకుడుగా ముందుకెళ్తేనే కాంగ్రెస్ లాభ‌ప‌డుతుంద‌ని గ్ర‌హించిన‌ట్టు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈడీ, సీబీఐ చర్యలు... రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం వ్యవహ‌రిస్తున్న తీరు, తాజాగా ఢిల్లీ లాఠీఛార్జ్. ఇలా ప్ర‌తి అంశంపై అమిత్‌షానే టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్. బీజేపీని ఎదుర్కోవాలంటే... కేవలం మోదీని మాత్రమే టార్గెట్ చేస్తే సరిపోదని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్టుంది. అందుకే... బీజేపీ నిర్ణయాల వెనుక ఉన్న అసలు వ్యూహకర్త అమిత్‌షానే అనే ఇమేజ్‌ను ప్రజల్లో బలపరిచే ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

రాజకీయాల్లో ప్రత్యర్థిని ఓడించాలంటే... ముందుగా అతని బలమైన కోటపైనే దాడి చేయాలి. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తోందా అని చ‌ర్చించుకుంటున్నారు. మోదీ తర్వాత బీజేపీలో అత్యంత ప్రభావశీల నాయకుడిగా భావించే అమిత్‌షాను నేరుగా టార్గెట్ చేసి.. బీజేపీని డిఫెన్స్‌లోకి నెట్టాల‌నుకుంటోంది కాంగ్రెస్. బీజేపీని బలహీనపరచాలంటే... పార్టీ ముఖచిత్రాన్ని కాదు... పార్టీ వ్యూహాన్ని నడిపించే వ్యక్తిని టార్గెట్ చేయాలనే నిర్ణయానికి కాంగ్రెస్ వ‌చ్చిన‌ట్టుంది. అందుకే ఈ హ‌డావుడంతా. ఇదే ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్.

#Amit Shah#Rahul Gandhi#Congress#BJP#Delhi Lathi Charge#Parliament Session#Amit Shah Resignation#Congress Strategy#BJP vs Congress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి