సినిమా

Raaka: రెండు భాగాలుగా రాకా..అసలు విశేషాలివే..!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాకా. నిన్నా మొన్నటి వరకూ ఈ సినిమా బడ్జెట్ 600 నుంచి 700 కోట్లని మాట్లాడుకున్నారు. కానీ, ఇప్పుడు బడ్జెట్ విషయమే కాదు, చాలా షాకింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. అవేంటో తెలియాలంటే పూర్తి కథనంలోకి వెళ్ళాల్సిందే.

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాకా. నిన్నా మొన్నటి వరకూ ఈ సినిమా బడ్జెట్ 600 నుంచి 700 కోట్లని మాట్లాడుకున్నారు. కానీ, ఇప్పుడు బడ్జెట్ విషయమే కాదు, చాలా షాకింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. అవేంటో తెలియాలంటే పూర్తి కథనంలోకి వెళ్ళాల్సిందే.

తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది రాకా. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపిక పడుకొన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటి వరకూ వచ్చింది ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ తో చేసిన ఒక ఇంట్రో వీడియో, అలాగే..దీపిక తో చేసిన ఇంట్రో వీడియో..ఆ తర్వాత అల్లు అర్జున్ లుక్. ఇవన్నీ, సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి.

ఇక, తాజా సమాచారం మేరకు ఈ సినిమాను అట్లీ కుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడట. విశేషం ఏమిటంటే ఈ సినిమా కోసం ముందు నుంచి అనుకుంటున్నట్టుగా 6 నుంచి 7 వందల కోట్ల బడ్జెట్ కాదట. 1000 కోట్లతో తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారట. అంతేకాదు, మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్ అని, ఆమె రెండవ పార్ట్ లో హీరోయిన్‌గా కనిపించబోతుందని ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక, మొదటి భాగాన్ని హిస్టారికల్ నేపథ్యంలో రూపొందిస్తే, రెండవ పార్ట్ ని మాత్రం ఫ్యూచరిస్టిక్ గా రూపొందిస్తున్నారట. ఇవే కాదు, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టుగా ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అట్లీ హిందీలో జనాన్ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ బాండింగ్‌తోనే రాకా లో ఓ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడట. ఇన్ని విశేషాలున్న రాకా, రానున్న రోజుల్లో ఇంకెన్ని సర్‌ప్రైజెస్ ఇవ్వబోతున్నారో చూడాలి.

#raaka#alluarjun#deepikapadukone#atleekumar#mrunathakur
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి