వైరల్ న్యూస్

WhatsApp Web Calling: ఫ్రీగా మరో సూపర్ ఫీచర్ ను పరిచయం చేస్తున్న వాట్సాప్!..

రచన: Venu4 నిమిషాల పఠనం

మొదట సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లతో ప్రయాణం మొదలుపెట్టిన వాట్సప్ తర్వాత ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు, డాక్యుమెంట్లు, లొకేషన్ షేరింగ్, స్టేటస్, యూపీఐ పేమెంట్స్, కమ్యూనిటీస్, ఛానెల్స్, AI ఫీచర్లు..ఇలా ఒక్కో అప్‌డేట్‌తో యూజర్ల జీవితంలో భాగమైంది.

ఒకప్పుడు కేవలం హాయ్ అనే మెసేజ్ పంపడానికి మాత్రమే ఉపయోగించిన వాట్సాప్... నేడు ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌గా మారింది. 2009లో ప్రారంభమైన ఈ యాప్... మొదట సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లతో ప్రయాణం మొదలుపెట్టింది. తర్వాత ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు, డాక్యుమెంట్లు, లొకేషన్ షేరింగ్, స్టేటస్, యూపీఐ పేమెంట్స్, కమ్యూనిటీస్, ఛానెల్స్, AI ఫీచర్లు... ఇలా ఒక్కో అప్‌డేట్‌తో యూజర్ల జీవితంలో భాగమైంది.

ఇక ఇప్పటివరకు కంప్యూటర్‌లో వీడియో కాల్ చేయాలంటే డెస్క్‌టాప్ యాప్ తప్పనిసరి. కానీ ఇకపై గూగుల్ క్రోమ్, ఎడ్జ్ వంటి ఏ వెబ్ బ్రౌజర్‌లోనైనా WhatsApp Web ఓపెన్ చేసి... ఎలాంటి యాప్ ఇన్‌స్టాల్ చేయకుండా నేరుగా ఆడియో, వీడియో కాల్స్ చేయొచ్చు...

ముఖ్యంగా ఆఫీస్ ల్యాప్‌టాప్‌లలో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతి లేని ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు, షేర్డ్ కంప్యూటర్లు ఉపయోగించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఇక వాట్సాప్ ఈ అప్‌డేట్స్‌ జూలై 28-2026న అధికారికంగా ప్రకటించింది.

అంతేకాదు... స్క్రీన్ షేరింగ్, రియాక్షన్స్, కాల్ హిస్టరీ, ఫేవరెట్స్ వంటి అన్ని ఫీచర్లు కూడా వెబ్‌లోనే అందుబాటులో ఉంటాయి. మరో ఆసక్తికరమైన ఫీచర్.. కాల్ ట్రాన్స్‌ఫర్. ఒకసారి కాల్ మొదలైతే.. అది కట్ చేయాల్సిన అవసరం లేదు. మొబైల్‌లో మాట్లాడుతున్న కాల్‌ను అదే సమయంలో ల్యాప్‌టాప్‌కు లేదా మరో డివైస్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా మార్చుకోవచ్చు.

ఇక గ్రూప్ కాల్స్ కోసం వెయిటింగ్ రూమ్ ఫీచర్ కూడా రాబోతోంది. జూమ్‌లో ఉన్నట్లే.. హోస్ట్ అనుమతి ఇచ్చిన తర్వాతే కొత్త సభ్యులు కాల్‌లో చేరగలరు. దీంతో గ్రూప్ మీటింగ్‌ల భద్రత మరింత పెరుగుతుంది. అలాగే రద్దీ ప్రాంతంలో ఉన్నా, వెనుక పెద్ద శబ్దాలు ఉన్నా, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ సప్రెషన్ టెక్నాలజీ మీ గొంతును స్పష్టంగా వినిపించేలా పనిచేస్తుంది.

అదేవిధంగా ఈ వెబ్ కాల్స్ అన్నీ కూడా పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సేఫ్ గా ఉంటాయి. కాలపరిమితి లేదు... అదనపు చార్జీలు లేవు.. ఈ సర్వీసు పూర్తిగా ఉచితం. మొదట చిన్న మెసేజింగ్ యాప్‌గా మొదలైన వాట్సాప్.. నేడు వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు ఉపయోగపడే పూర్తి కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌గా మారింది. టెక్నాలజీ ప్రపంచంలో మరో కీలక అడుగు వేస్తూ.. యూజర్లకు మరింత సులభమైన, సురక్షితమైన సేవలను అందించడానికి సిద్ధమవుతోంది.

#WhatsApp#introducing#super feature#free#Web Calling#Call Transfer#Waiting Room#Background#Noise Suppression#Time Limits
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి