టాప్ న్యూస్

HIV : ఆ రాష్ట్రంలో ఘోరం.. 7 వేల మంది విద్యార్థులకు HIV పాజిటివ్!

రచన: Kumar3 నిమిషాల పఠనం

చదువుకోవాల్సిన విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడినట్టు తెలుస్తోంది. దీంతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వేల సంఖ్యలో స్టూడెంట్స్ హెచ్ఐవీ బారిన పడినట్టు సమాచారం. HIV పాజిటివ్ కేసులకు సంబంధించి కర్ణాటకలో ఇటీవల వెలుగుచూసిన ఒక సంచలనాత్మక నివేదిక దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

చదువుకోవాల్సిన విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడినట్టు తెలుస్తోంది. దీంతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వేల సంఖ్యలో స్టూడెంట్స్ హెచ్ఐవీ బారిన పడినట్టు సమాచారం. HIV పాజిటివ్ కేసులకు సంబంధించి కర్ణాటకలో ఇటీవల వెలుగుచూసిన ఒక సంచలనాత్మక నివేదిక దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్రంలోని యువత, విద్యార్థులే పెద్ద సంఖ్యలో హెచ్‌ఐవీ (HIV) బారిన పడుతున్నట్టు ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది.

ఇటీవల అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన వివిధ మెడికల్ క్యాంపుల్లో భారీగా నమూనాలు సేకరించారు. వాటిని ల్యాబ్‌కు పంపించి విశ్లేషించగా భయానక విషయం బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 7 వేల మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చినట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.చిన్న వయసులో వేలాది మంది విద్యార్థులు క్యూర్ లేని మహమ్మారి బారిన పడటం పట్ల ఆరోగ్య నిపుణులు, పేరెంట్స్ సైతం షాక్ లో ఉన్నారు.

ఈ పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్న సర్కార్.. రాష్ట్రంలో హెచ్‌ఐవీ వ్యాప్తిని ప్రాథమిక దశలోనే అరికట్టేందుకు చర్చలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థల్లో ఉచిత పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలల్లోనూ ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపులు, హెచ్‌ఐవీ వ్యాప్తి చెందే మార్గాలు, నివారణపై విద్యార్థులకు సమగ్ర అవగాహనా సదస్సులు నిర్వహించాలని వైద్యారోగ్య శాఖకు స్పష్టమైన ఉత్తర్వులు అందాయి. ఈ ప్రత్యేక డ్రైవ్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు అధికారులు,ఆరోగ్యశాఖ చాలా వేగంగా చర్యలు చేపట్టినట్టు సమాచారం.

#Hiv cases#banglore#karnataka#students#national
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి