కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ ప్రతినిధి సౌరవ్ దాస్‌పై నటి, ఎంపీ కంగనారనౌత్ సంచన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా, కేంద్రమంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ ప్రతినిధులు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వడం.. పార్లమెంట్ మార్చ్‌కు ఇచ్చిన పిలుపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడం వంటి ఘటనలు జరిగిన విషయం తెలిసిందే.పార్లమెంట్ మార్చ్‌లో విద్యార్థులపై పోలీసుల దాడులకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నిన్న సుప్రీంకోర్టు విచారణ జరిపి.. మైనర్లు, నేరచరిత్రలేని విద్యార్థులను విడుదల చేయాలని కేంద్రం, అన్నిరాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే ఎంపీ కంగనా రనౌత్.. సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ‘నీట్ ప్రొటెస్ట్ వీడియోలు చూస్తే వాంతి వచ్చేలా ఉన్నాయంటూ’ కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ మీద సౌరవ్ దాస్ కౌంటర్ ఇచ్చారు. కంగనాను ఆమె పార్టీలోనే ఎవరు పట్టించుకోరు.. మనం పట్టించుకోవల్సిన అవసరంలేదంటూ పేర్కొన్నారు. దీంతో కంగనా ‘ఇన్ స్టా’లో పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతోంది.
సౌరవ్ దాస్.. ‘పనికిరానివాడు, నిరుద్యోగి’ అని అభివర్ణించారు. అతని గురించి గూగుల్ చేశాను. అతడి వయసు 28ఏళ్లు. తనను తాను విద్యార్థి అని ఎలా చెప్పుకుంటున్నాడో అర్థం కావడంలేదని ఫైర్ అయ్యారు. సౌరవ్ వయసు వచ్చేసరికి తనకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయని.. గత రెండేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని పేర్కొన్నారు. గత 20ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని.. నిర్మాతగా, నటిగా, స్క్రీన్ రైటర్, పారిశ్రామికవేత్తనని వివరించారు. ఎంపీగా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నానని చెప్పారు. ‘సౌరవ్.. నీ వ్యక్తిగత సమస్యలు నీ పర్సనల్.కానీ, నువ్వు స్టూడెంట్ కాదు. కేవలం పనికిరానివాడివి. ముందుగా ఏదైనా స్కిల్ నేర్చుకోవడం ప్రారంభించు’ అని ఫైర్ అయ్యారు.












