క్రైమ్

Crime : యువతి కిడ్నాప్, గ్యాంగ్ రేప్..సినిమా లెవల్లో ఛేజింగ్, గన్ ఫైరింగ్!

రచన: Kumar3 నిమిషాల పఠనం

యూపీలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులు కిరాతకంగా వ్యవహరించారు. 19 ఏళ్ల యువతిని అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది.విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు ఫైల్ చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

యూపీలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులు కిరాతకంగా వ్యవహరించారు. 19 ఏళ్ల యువతిని అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది.విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు ఫైల్ చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత యువతిని ఆస్పత్రికి తరలించి ముందుగా ట్రీట్మెంట్ అందించారు. ఉత్తరప్రదేశ్‌ రుద్రపూర్‌లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు ఉన్న చోటును గుర్తించిన పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా..వారు ప్రతిఘటించారు.ఏకంగా పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు.ఈ క్రమంలోనే పోలీసులు సైతం ఎదురుకాల్పులు జరిపి.. చివరికి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల కాల్పుల్లో ఒక నిందితుడి కాలికి గాయాలు అయ్యాయి.సీన్ రీక్రియేషన్‌కు ఇద్దరిని తీసుకెళ్లగా..పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నం చేయగా..

https://x.com/pulsenewsbreak/status/2082263838037344428?s=20

స్థానికులతో పాటు పోలీసులు వెంబడించి వారిని పట్టుకొని అక్కడికక్కడే దేహశుద్ధి చేసినట్టు తెలిసింది. పోలీసులు నిందితులను వెంబడించి పట్టుకున్న దృశ్యాలను పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. సినిమా రేంజ్‌లో నిందితులను పోలీసులు ఛేజ్ చేసి పట్టుకోవడం ఫస్ట్ టైం రియల్‌గా చూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు.

#Gangrape#Utterpradesh#three members#arrested#up police
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి