Nagarjuna: అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైల్‌స్టోన్ మూవీ ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ అంటెస్టెడ్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఇదొకటి. రా.కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు మరోసారి నాగ్‌తో జోడీ కడుతుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. అయితే సినిమా సెట్స్ పైకి వెళ్లి చాలా కాలం అవుతున్నప్పటికీ, ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక అప్‌డేట్ రాకపోవడంతో అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఈ సైలెన్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఎట్టకేలకు చిత్రబృందం మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. అక్కినేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆ శుభసమయం రానే వస్తోంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు కావడంతో, ఆ స్పెషల్ డే రోజున ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగా వందో సినిమా నుంచి అఫీషియల్ టైటిల్‌తో పాటు అదిరిపోయే టీజర్ వీడియోను ఒకేసారి రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగ్ ఏకంగా ఐదు రకాల డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తుండగా.. ఆ విజువల్స్ అన్నీ టీజర్‌లోనే రివీల్ చేయనున్నారని టాక్.
కాగా, మరోవైపు ఈ సినిమా విడుదల తేదీపై కూడా ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ను వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలని భావించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద నెలకొన్న తాజా పరిణామాలు, ఇతర సినిమాల షెడ్యూల్స్‌లో వస్తున్న మార్పుల నేపథ్యంలో ప్లాన్ పూర్తిగా మారిపోయినట్లు సమాచారం. అప్పట్లో నాగార్జునకు అచ్చొచ్చిన డిసెంబర్ సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలని ఆయన చూస్తున్నారట. బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబో సినిమా షూటింగ్‌కు అనుకోని బ్రేక్ పడటంతో ఆ గోల్డెన్ డిసెంబర్ స్లాట్ ఖాళీ అయింది. దీంతో ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటూ తన వందో సినిమాను అదే రేస్‌లోకి తీసుకురావాలని నాగ్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.












