తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి భయభ్రాంతులకు గురిచేయడంతో ముగ్గురు మహిళలు అదే నిజమని నమ్మి గుండు చేయించుకున్నారు. డబ్బులకు ఆశపడి, వ్యాధులకు భయపడి ఆ మహిళలు ఇలా చేసినట్టు తెలుస్తోంది.విక్రమార్కుడు సినిమాలో డబ్బులొస్తాయని నమ్మి మహిళలు గుండు కొట్టించుకున్న సీన్ రిపీట్ అయ్యిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.
వివరాల్లోకివెళితే..తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ ప్రాంతంలో కరోనా లాంటి కొత్త రకం వ్యాధి సోకుతుందని, విదేశాల్లో ఈ వ్యాధి సోకిన వారంతా గుండు గీయించుకున్నారని, తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుందని సదరు వ్యక్తి ..ఓ మహిళను భయభ్రాంతులకు గురిచేసినట్టు తెలిసింది.
గుండు గీయించుకున్న మహిళలకు రూ.15 వేలు, కాలేజ్ విద్యార్థినులకు అయితే రూ.45,000, ఉచిత ల్యాప్‌టాప్, పురుషులకు అయితే రూ.6,000 ఇస్తామని, లిస్టులో మీ పేరు ఉందని మీకు ఫోన్ చేస్తున్నామని దుండగుడు ఓ మహిళను నమ్మించినట్టు సమాచారం.ఆ మహిళ ఈ విషయాన్ని స్థానిక మహిళలందరికీ చెప్పడంతో ముగ్గురు మహిళలు గుండు గీయించుకున్నారు.
https://x.com/TeluguScribe/status/2082359549089161290?s=20
అనంతరం దుండగుడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించి బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆకతాయిల పని అని తెలిసి కన్నీరుమున్నీరయ్యారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.












