తెలంగాణ

HYD : జూబ్లీహిల్స్ సీఐ కీచకపర్వం.. పెళ్లిపేరుతో నమ్మించి రూ.2 కోట్లు కాజేసి!

రచన: Kumar3 నిమిషాల పఠనం

తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు రెడ్డి దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళకు మాయమాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సహజీవనం చేసి గర్భం దాల్చిన తరువాత

రాష్ట్రంలో మరో పోలీసు అధికారి కీచకపర్వం వెలుగుచూసింది.ఇటీవలి కాలంలో పోలీసులు, అధికారులు వరుసగా వివాహేతర సంబంధాల కేసుల్లో బుక్కవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఒక బాధ్యతయుతమైన పదవుల్లో ఉండి ఇలా చేస్తుండటంతో తిరిగి నేరస్తులే వారిని ప్రశ్నించే స్థాయికి వారు దిగజారారు అని విమర్శలు వస్తున్నాయి.తప్పు చేసి స్టేషన్‌కు వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చే పోలీసులే ఇలా తప్పులు చేయడం ఏంటని.. లా అండ్ ఆర్డర్ అందుకే అదపు తప్పుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు రెడ్డి దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళకు మాయమాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సహజీవనం చేసి గర్భం దాల్చిన తరువాత బెదిరించి అబార్షన్ చేయించాడని.. రహస్యంగా చిత్రీకరించిన ప్రైవేట్ వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేసి రూ.2 కోట్ల వరకు దోచుకున్నాడని ఆయన మీద కేసు ఫైల్ అయ్యింది.అన్ని ఆధారాలతో సహా రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు సదరు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది.

https://x.com/TeluguScribe/status/2082303766150422796?s=20

బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా గతంలో ట్రాఫిక్‌లో పనిచేసిన ఆయన..జూబ్లీహిల్స్ సివిల్ ఇన్ స్పెక్టర్ పోస్టు కోసం రూ.25 లక్షలు లంచం ఇచ్చినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన్ను వీఆర్‌కు అటాచ్ చేసినట్టు సమాచారం.

#Jublihills Inspecter#cheating#women#hyderabad#blockmailing#suspension
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి