రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. నేడు,రేపు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటం వల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్టు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇదిలాఉండగా,హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురవడంతో ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వెళ్లే దారిలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరోవైపుఉప్పల్-నారపల్లి వంతెన పనులు ఆలస్యం కావడంతో రోడ్లపై భారీగా నిలిచింది. దీంతో అధికారులు మోటార్లు పెట్టి నీటిని ఎత్తిపోశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓవైపు వర్షం, రోడ్లపై నీరు, వంతెన పనులు జరుగుతుండటంతో గంటల తరబడి ట్రాఫిక్‌లో వెయిట్ చేయాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
https://x.com/TeluguScribe/status/2082313053161615574?s=20
2018 జులైలో ప్రారంభమైన ఫ్లైఓవర్ పనులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా 8 ఏళ్లుగా స్థానికులతోపాటు వాహనదారుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో దసరాకు ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించినా. ప్రస్తుతం సాగుతున్న పనులు చూస్తే 2027 దసరాకు కూడా ప్రారంభం అయ్యేలా కనిపించడం లేదని వాహనదారులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.












