Sharwanand: మిడ్ రేంజ్ హీరోలలో డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్న శర్వానంద్.. బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ అనే టాక్ తెచ్చుకున్నాడు. అయితే, ఈ మధ్య ఈ టాలెంటెడ్ హీరోకి ఆశించిన విజయాలు అందడం లేదు. మొన్నా మధ్య బైకర్ సినిమాతో వచ్చినప్పటికీ, అది పెద్ద కమర్షియల్ హిట్ గా ఏమీ నిలవలేదు.
ప్రస్తుతం శర్వానంద్ చేతిలో భోగి అనే సినిమా ఉంది. దీనికి, సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందుతోంది. ఇప్పటికే, షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ను జరుపుకుంటోంది. అయితే, రష్ చూసిన శర్వానంద్, సంపత్ నంది వర్క్ కి బాగా ఇంప్రెస్ అయ్యాడట.
దాంతో, భోగి రిలీజ్ అవగానే, మరో సినిమాను చేయడానికి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సంపత్ కూడా భోగి తర్వాత మరో కథను శర్వాకి చెప్పే ప్రయత్నాలలో ఉన్నాడట. ఇలాంటి ట్యూనింగ్ మన తెలుగు ఇండస్ట్రీలో చాలా కామన్. హీరోకి గనక ఒక దర్శకుడు హిట్ ఇస్తే..మళ్ళీ, మళ్ళీ అదే దర్శకుడితో సినిమా చేయడానికి ఆ హీరోలు ఆసక్తి చూపిస్తారు.
శర్వానంద్ కూడా, ఇప్పుడు సంపత్ నంది విషయంలో అలాగే ఫీలైనట్టుగా అర్థమవుతోంది. సంపత్ నంది, తమన్నాలది మంచి కాంబినేషన్. రచ్చ నుంచి సంపత్ నందితో మిల్కీ బ్యూటీ ట్రావెల్ చేస్తోంది. గత చిత్రం ఓదెల 2 వీరి కాంబోలో వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు, శర్వానంద్ తో సంపత్ నంది కలవడం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన విషయమే. కాగా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నాడు.












