మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ మెంబర్, పాలిట్‌బ్యూరోలో మిగిగిన ఏకైక టాప్ లీడరర్ మిసిర్ బెస్రాను మంగళవారం రాత్రి భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. జార్ఖండ్‌లోని ధన్‌బాద్-గిరిడీ జిల్లాల సరిహద్దులోని తుండి-మండియా అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్, ఆ రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో బెస్రా చిక్కినట్టు ప్రకటించారు.
బెస్రాతో పాటే అతని అనుచరులు గౌరవ్ హాస్దా, మోచూలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలగాల మోహరింపు తీవ్రం కావడం, దానికి ముందు రోజే బెస్రా ప్రధాన అనుచరులు 16 మంది లొంగిపోవడంతో దండకారణ్యం నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తుండగా బెస్రాను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై ప్రభుత్వం రూ.కోటికి పైగా రికార్డు ఉంది.
మిసిర్ బెస్రా అరెస్ట్‌తో మావోయిస్ట్ కేంద్ర కమిటీకి చెందిన క్రియాశీల నాయకులు ప్రస్తుతం ఎవరూ యాక్టివ్, బయట లేరని తెలుస్తోంది. గతంలో 40 మందికి పైగా సభ్యులు ఉన్న కేంద్ర కమిటీలో.. వరుస ఎన్‌కౌంటర్లు, అరెస్టులు, లొంగిబాటల ద్వారా ఇప్పుడు అగ్రనేతలు ఎవరూ మిగలలేదు.
రెండ దశాబ్దాలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న బెస్రా సైతం ఇప్పుడు పట్టుబడ్డాడు. గతంలో బెస్రా ఆయన అనుచరులు యాక్టివ్‌గా ఉండటం వలన వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలోని సారండా అడవులను 'నక్సల్ ప్రభావిత ప్రాంతం'గా కేంద్రం ప్రకటించింది.తాజాగా బెస్రా అరెస్టుతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెస్ట్ సింగ్‌భూమ్ హోదాపై పునఃసమీక్ష జరిపే అవకాశమున్నట్టు సమాచారం.












