Aadarsha Kutumbam: టాలీవుడ్ సీనియర్ విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టాడు త్రివిక్రమ్. ఈసారి ప్రోమోలతోనే అదరగొడుతున్నాడు. కేజీఎఫ్ సిరీస్, అలాగే.. తెలుగులో హిట్ 3, తెలుసు కదా సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.
వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంట స్క్రీన్ మీద బాగా ఆకట్టుకుంటుందని పోస్టర్స్, ప్రోమోలు చూస్తేనే అర్థమవుతోంది. ఇక.. దర్శకుడు త్రివిక్రమ్, వెంకీ కలయికలో చేస్తున్న ఈ సినిమా నుంచి ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ అప్డేట్ లని చిత్రబృందం రివీల్ చేస్తూ సర్‌ప్రైజ్ చేస్తోంది. ఈ క్రమంలో ముందుగా వెంకీ పోషిస్తున్న చిట్టిబాబు పాత్ర తాలూకా టీజర్ ని వదిలారు.
దీని, తర్వాత శ్రీనిధి శెట్టి ప్రోమోని విడుదల చేశారు. ఈ రెండింటికీ అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక, తాజాగా.. ఇదే ఆదర్శ కుటుంబం నుంచి చిట్టిబాబు కూతురు పాత్రని కూడా రివీల్ చేశారు.
యంగ్ బ్యూటీ యువిన పార్థవిని వెంకీ, కూతురు సంపూర్ణ అంటూ పరిచయం చేసిన ప్రోమోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోల్ కూడా సినిమాలో మంచి ఫన్ జనరేట్ చేస్తుందని అర్థమవుతోంది. ఇలా మొత్తానికి త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం నుంచి ఒక్కో రోల్ ని రివీల్ చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో రాబోతున్న ఆ నాలుగవ పాత్ర ఎలా ఉండబోతుందో అని అందరిలో ఆసక్తి మొదలైంది. కాగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు.












