సినిమా

Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డేకి విశ్వంభర రిలీజ్ డేట్ ప్రకటన

రచన: Anshu4 నిమిషాల పఠనం

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలలో ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా విశ్వంభర. తాజా సమాచారం మేరకు ఈ సినిమా విడుదల తేదీ ఆగస్టు 22న వెల్లడికానుందని తెలుస్తోంది. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా..ఆషిక రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బింబిసార సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు.

వాస్తవానికి, ఈ సినిమా మనశంకరవరప్రసాద్‌గారు సినిమాకి ముందే రిలీజ్ కావాల్సింది. కానీ, కంప్యూటర్ గ్రాఫిక్ పూర్తి కాకపోవడంతో ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. సమ్మర్ కి రిలీజ్ చేస్తారని అన్నారు. కానీ, ఆ డేట్ కూడా మిస్ అయింది. ఇప్పుడు అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. అక్టోబర్ 16వ తేదీని లాక్ చేసినట్టుగా కూడా ఫిల్మ్ సర్కిల్‌లో టాక్ వినిపిస్తోంది.

అయితే, అధికారికంగా మాత్రం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22న ప్రస్తుతం నటిస్తున్న బాబీ సినిమాతో పాటు విశ్వంభర సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారట. భారీ విజువల్ వండర్‌గా విశ్వంభర సినిమాను రూపొందిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఈ రెండు సినిమాల తర్వాత చిరు దసరా సినిమాతో ఆకట్టుకున్న శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమాను చేయాల్సి ఉంది. ఇప్పటికే, ప్రాజెక్ట్ ని అనౌన్స్ కూడా చేశారు. నాని తన సొంత నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. ప్రస్తుతం, నాని-శ్రీకాంత్ ఓదెల కలిసి ది ప్యారడైజ్ సినిమాను చేస్తున్నారు. దీని, తర్వాత మెగాస్టార్ సినిమాను పట్టాలెక్కించనున్నారు.

#Viswambhara#Chiranjeevi#Megastar#Trisha#MallidiVasishtha
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి