తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. కొండా సురేఖ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తరువాత కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సురేఖ స్థానంలో మంత్రిగా మహిళకే అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.. మరోవైపు కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే హైకమాండ్ కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. సురేఖ పైన వేటు వేస్తూనే.. ఒకే సారి ముగ్గురు మహిళలకు పదవులు కట్టబెట్టడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్టు చర్చించుకుంటున్నారు.
ఇక కొండా సురేఖ ఒకవేళ పార్టీని వీడి కాంగ్రెస్ మీద తిరగబడితే.. ఆమెను ఢీ కొట్టేందుకు విజయశాంతికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది.. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మరో ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.. కేబినెట్ లోకి విప్ ఆది శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలనే ప్లాన్ లో ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. అదే విధంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకొని.. ప్రస్తుత కేబినెట్ లో బీసీ మంత్రికి టీపీసీసీ పగ్గాలు ఇవ్వాలనే యోచనలో సిఎం ఉన్నట్టు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది..
అదే విధంగా స్పీకర్ ప్రసాద కుమార్ ను సైతం కేబినెట్ లోకి తీసుకుంటారని.. ఆయన స్థానంలో ఉమ్మడి కరీంనగర్ ఎస్సీ వర్గానికి చెందిన మంత్రిని స్పీకర్ గా చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇన్ని కీలక మలుపులతో వేడెక్కుతున్న తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం.. ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది! పార్టీలో అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతుండటంతో.. మంత్రి పదవులపై కోటి ఆశలు పెట్టుకున్న నేతల్లో గుబులు మొదలైంది.
మరోవైపు కొండ సురేఖ ఫ్యామిలీతో తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతుంది.. వారితో సుదీర్ఘ చర్చలు జరిపినట్టు సమాచారం.. ఇంకోవైపు కొండ సురేఖను బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. మొత్తానికి కొండా సురేఖ రాజకీయ వ్యవహారం.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది.. ఒకవైపు కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, మరోవైపు సొంత పార్టీ నుంచే ఎదురవుతున్న విమర్శలు.. దీనికితోడు బీఆర్ఎస్ నో-ఎంట్రీ బోర్డు తగిలించడంతో కొండా సురేఖ తదుపరి రాజకీయం తీవ్ర ఉత్కంఠగా మారింది.












