సినిమా

Megastar-Kaaka: "కాకా" అప్‌డేట్..హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్

రచన: Anshu4 నిమిషాల పఠనం

Megastar-Kaaka: మెగాస్టార్ చిరజీవి నటిస్తున్న సినిమాలలో "కాకా" ఒకటి. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి సంబందించిన లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. ఇది, లాంగ్ షెడ్యూల్ అని తెలుస్తోంది.

ఇప్పటికే ఫస్టాఫ్ లాక్!

"కాకా" సినిమాకి సంబందించిన ఫస్టాఫ్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందట. అంతేకాదు, ఎడిటింగ్ కూడా పూర్తైందని తెలుస్తోంది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మొదలుపెట్టాల్సి ఉంది. ఫస్టాఫ్ కి సంబందించిన టాకీ పార్ట్ ని ఇప్పటికే, హైదరాబాద్ లోని సిటీ కాలేజీలో చిత్రీకరించారు. ఈ షూట్‌లో చిరు, అనస్వర రాజన్ పాల్గొన్నారు. అలాగే, పొలాచ్చిలోనూ ఓ షెడ్యూల్‌ని కంప్లీట్ చేశారు.

హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్:

సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ నెల మొత్తం టాకీ పార్ట్ ని పూర్తి చేయడానికి బాబీ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. నివేదా పేతురాజ్, గెటప్ శ్రీను, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ఇటీవల వచ్చిన టీజర్‌లో చిరు స్వాగ్ అదిరిపోయింది. గ్యారెంటీగా బాబి-చిరు కాంబోలో మరో బ్లాక్ బస్టర్ పడబోతుందనే నమ్మకాలు కలిగాయి.

2027, సంక్రాంతికే రిలీజ్:

ఇక, ఈ సినిమాను ఖచ్చితంగా 2027, సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ చేయనున్నట్టు యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం. నిన్నామొన్నా "కాకా" రావాల్సిన డేట్‌లో మెగాస్టార్ నటిస్తున్న సోషియో ఫాంటసీ "విశ్వంభర" రిలీజ్ కాబోతుందని వార్తలు వచ్చాయి. అదే నిజమైతే "కాకా" 2027 సమ్మర్‌కి పోస్ట్ పోన్ అవడం ఖాయం అనుకున్నారు. కానీ, "విశ్వంభర" ఊసే లేదు. "కాకా" మాత్రం అనుకున్న తేదీకే దిగబోతున్నాడు.

#Megastar Chiranjeevi#Kaaka#Director Bobby#KVN Productions
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి