తెలంగాణ

KCR: అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కీలక ఆదేశాలు

రచన: NK4 నిమిషాల పఠనం

KCR: సెప్టెంబర్ 7 నుండి శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 6న ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు.

KCR: సెప్టెంబర్ 7 నుండి శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 6న ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించనున్నారు గులాబీ బాస్. అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి అనేదానిపై దిశానిర్దేశం చేయనున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఏయే అంశాలను లేవనెత్తాలి అనే అంశంపై ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేయనున్నారు కేసీఆర్. దాదాపు 8 నుంచి 10 కీలక అంశాలను ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాలని ఇప్పటికే బీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలు, అమలు చేయని హామీలు, ఆరు గ్యారెంటీలు, ఎన్నికల సమయంలో చేసిన డిక్లరేషన్స్ గురించి అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం ఉంది.

ఇక రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న మరో ప్రధాన అంశం 22ఏ నిషేధిత భూముల జాబితా. రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న 22ఏ అంశాన్ని అస్త్రంగా చేసుకుని అసెంబ్లీలో ప్రభుత్వంపై విరుచుకుపడాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. నీటి పంపకాల అంశాన్ని కూడా అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం ఉంది.

అసెంబ్లీ పని దినాలపైనా బీఏసీ సమావేశంలో గట్టిగా పట్టుబట్టాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. సమావేశాలను కనీసం 15 నుంచి 20 రోజుల పాటు నిర్వహించాలని, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈసారి అసెంబ్లీ సెషన్ లో కచ్చితంగా చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టే చాన్స్ ఉంది. ఈ అంశాలపై ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేదానిపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ నెల 6న జరిగే బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

#KCR#Telangana Assembly Sessions#Brs#Brs Lp Meeting#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి