తెలంగాణ

Telangana Congress: 6న కాంగ్రెస్ మహా ధర్నా.. కేసీఆర్ రాజీనామాకు డిమాండ్

రచన: NK4 నిమిషాల పఠనం

Telangana Congress: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేస్తుంటే.. అందుకు కౌంటర్ గా కాంగ్రెస్.. కేసీఆర్ ను టార్గెట్ చేసింది. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

Telangana Congress: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేస్తుంటే.. అందుకు కౌంటర్ గా కాంగ్రెస్.. కేసీఆర్ ను టార్గెట్ చేసింది. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ వెయ్యి రోజుల్లో.. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని, ప్రజా సమస్యలపై ఒక్క రోజు కూడా మాట్లాడలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జీతం తీసుకుంటున్నారు కానీ అసెంబ్లీ సమావేశాలకు మాత్రం రావడం లేదని ధ్వజమెత్తారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఒక్కరోజు కూడా పూర్తిగా అసెంబ్లీలో గడపని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 6న హైదరాబాద్‌ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నారు.

ఇటీవల ఓ సభలో మాట్లాడిన సీఎం రేవంత్.. కేసీఆర్ టార్గెట్ గా చెలరేగిపోయారు. ఈ వెయ్యి రోజుల్లో ప్రధాన ప్రతిపక్ష నేత జీతం, ఇతర సదుపాయల రూపంలో రూ.22.24 కోట్లు ప్రజా ధనం తీసుకున్నారని.. కానీ, జనం కోసం ఒక్కసారైనా బయటకు వచ్చారా? ఒక్కసారైనా మాట్లాడారా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఈ వెయ్యి రోజుల్లో ఒక్కరోజు కూడా తనను ఎన్నుకున్న ప్రజల కోసం కానీ రాష్ట్రం కోసం కానీ పని చేయలేదన్నారు. మూడేళ్లుగా ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజల సొమ్ము తిని ఫాంహౌస్‌లో పడుకుంటే సరిపోతుందా? వెయ్యి రోజులు ముఖం చాటేసిన ప్రతిపక్ష నేత దేశంలో ఎవరైనా ఉన్నారా? అంటూ నిప్పులు చెరిగారు.

తాను ఈ వెయ్యి రోజుల్లో ఒక్క గంట కూడా సెలవు తీసుకోలేదని, కేసీఆర్ మాత్రం ఒక్క గంట కూడా ప్రజలకు సమయం కేటాయించలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేతగా విఫలమైనందున, ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రానందున కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. అదే డిమాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా ఈ నెల 6న మహా ధర్నాకు సిద్ధమైంది కాంగ్రెస్.

#Kcr#Cm Revanth Reddy#Kcr Resignation Demand#Brs#Congress#Telangana Politics#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి