సినిమా

Deepika Padukone: రియల్ లైఫ్ బేబీ బంప్‌తో రాకా షూట్‌లో దీపిక!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Deepika Padukone: సినిమాలో హీరోయిన్స్ గనక గర్భిణిగా నటించాల్సి వస్తే ఆర్టిఫిషియల్ పెగ్నెన్సీ బంప్(బేబీ బంప్) తో నటిస్తారు. ఇలాంటి సన్నివేశాలలో పర్ఫార్మ్ చేయడం కూడా పెద్ద ఛాలెంజ్. పెళ్లి కాకుండా గర్భవతిగా ఫీలై నటించాల్సి వస్తే మహిళలకి పెద్ద టాస్క్ అని చెప్పాలి. కానీ, ఇలాంటి సీన్స్‌లో మన హీరోయిన్స్ చాలామంది జీవించారు.

Deepika Padukone: సినిమాలో హీరోయిన్స్ గనక గర్భిణిగా నటించాల్సి వస్తే ఆర్టిఫిషియల్ పెగ్నెన్సీ బంప్(బేబీ బంప్) తో నటిస్తారు. ఇలాంటి సన్నివేశాలలో పర్ఫార్మ్ చేయడం కూడా పెద్ద ఛాలెంజ్. పెళ్లి కాకుండా గర్భవతిగా ఫీలై నటించాల్సి వస్తే మహిళలకి పెద్ద టాస్క్ అని చెప్పాలి. కానీ, ఇలాంటి సీన్స్‌లో మన హీరోయిన్స్ చాలామంది జీవించారు.

ఇక, హీరోలు సైతం యాక్షన్ సీన్స్ కోసం డూప్ లేకుండా నటించిన సినిమాలెన్నో ఉన్నాయి. ఒకప్పుడు రోప్స్ కట్టుకొని వందల అడుగుల నుంచి కిందకి దూకే సీన్స్ చేశారు. అలాంటి, సీన్స్ చేసినప్పుడు కాళ్ళు, చేతులు విరిగిన సందర్భాలూ ఉన్నాయి. జంపింగ్ షాట్స్, రన్నింగ్ షాట్స్ మాత్రమే కాదు, కొన్ని ఫైట్ సీన్స్‌లో అద్దాలు బద్దలు కొట్టడం, బైక్స్‌తో ఢీ కొట్టడం..లాంటి సీన్స్ చేసినప్పుడు గాయాలై రక్తాలు కారిన సందర్భాలూ ఉన్నాయి.

కానీ, ఇవన్నీ సహజంగా రావాలంటే ఎంత నొప్పి ఉన్నా భరిస్తూ నటించాల్సి ఉంటుంది. కొన్ని సహజత్వం కోసం దెబ్బ తగిలినా అదే సమయంలో షూట్ చేసిన దర్శకులూ ఉన్నారు. ఇంత చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే, రాకా కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొణ్ రియల్ లైఫ్ బేబీ బంప్‌తో కొన్ని సీన్‌లో నటించిందట. సినిమాలో కొన్ని సీన్స్‌లో దీపిక గర్భిణిగా కనిపించాల్సి వచ్చిందట. అయితే, అప్పటికే ఆమె ప్రగ్నెంట్ కావడంతో దర్శకుడు అట్లీ సహజంగా వస్తే అద్భుతంగా ఉంటుందని దీపికతో మాట్లాడి ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు ఈ సీన్స్ ని షూట్ చేశాడట. ఇది, నిజంగా చాలా అరుదుగా జరిగే విషయం.

కాగా, అల్లు అర్జున్ రాకా మూవీలో త్రిపాత్రాభినయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, రెండు భాగాలుగా రాకా తెరకెక్కుతుండగా, మొదటి భాగంలో దీపిక పడుకొణ్, రెండవ భాగంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారట. రష్మిక మందన్న నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో, జాన్వీ కపూర్ మరో ముఖ్య పాత్రలో కనిపించనుందట. ప్రస్తుతం రాకా షూట్ ముంబైలోనే జరుగుతోంది.

#Allu Arjun#Atlee Kumar#Deepika Padukone#Sun Pictures#Rashmika Mandanna
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి