తెలంగాణ

Telangana: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ బిగ్ ప్లాన్!!..

రచన: Venu4 నిమిషాల పఠనం

గత కొంత కాలంగా రాజకీయాల్లో కేసీఆర్ అప్పుడప్పుడు మాత్రమే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనే భావనతో పెద్ద దొర ఈ అవకాశాన్ని ఆయుధంగా మలచుకుని తమ పార్టీ పునాదులు బలపరచుకునే పనిలో ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది..

తెలంగాణ రాజకీయాల్లో ఏర్పడుతున్న ఘటనలను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల ను టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నాయకత్వం తెలంగాణ కేంద్రంగా కొత్త వ్యూహాల అమలుకు ప్రణాళికలు సిద్దం చేసినట్టు తెలుస్తుంది.. ఇదే సమయంలో కోన ఊపిరితో ఉన్న బీఆర్ఎస్ కు ప్రాణం పోయాడానికి కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి..

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కావటంతో తాను రాజకీయంగా పూర్తి స్థాయిలో యాక్టివ్ కావాలని డిసైడ్ అయినట్టు గులాబీ శ్రేణుల నుండి సమాచారం.. గత కొంత కాలంగా రాజకీయాల్లో కేసీఆర్ అప్పుడప్పుడు మాత్రమే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనే భావనతో పెద్ద దొర ఈ అవకాశాన్ని ఆయుధంగా మలచుకుని తమ పార్టీ పునాదులు బలపరచుకునే పనిలో ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది..

అలాగే బీజేపీ సైతం రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలం పెంచుకునే వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. కానీ బీజేపీ-కాంగ్రెస్ కు పోటీ ఇవ్వదని.. కాబట్టి బీఆర్ఎస్ కు అవకాశాలు ఉన్నాయని భావించిన కేసీఆర్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు త్వరలోనే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టేందుకు సిద్దమైనట్టు తెలుస్తుంది.. ఇక రూట్‌మ్యాప్‌ కూడా సిద్ధం చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది..

ఈ నేపథ్యంలో డిసెంబర్ తరువాత బస్సు యాత్ర ఉంటుందని చిన్న దొర వెల్లడించారు. అలాగే తాను కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో పాదయాత్రలు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న ఘటనలను స్పూర్తిగా తీసుకున్న కేటీఆర్.. ఈ యాత్ర ద్వారా త్వరలోనే ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించారు.

ఇలా తండ్రీకొడుకులు ద్విముఖ వ్యూహంతో ఒకేసారి జనంలోకి వెళ్లటానికి సిద్ధమవటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ యాత్రల షెడ్యూల్‌పై త్వరలోనే స్పష్టత రానుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ పీక్ చేరుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..

#Telangana#KCR#big plan#Assembly elections#bjp#congress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి