తెలంగాణ

Congress : తాతా మధు కామెంట్స్.. స్పీకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ

రచన: Kumar5 నిమిషాల పఠనం

రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ మాటల యుద్దం నడుస్తోంది. నల్లటి దుస్తులు వేసుకుని వస్తే అసెంబ్లీలోకి అనుమతించలేదని, పోలీసుల చేత దాడులు చేయించడంతో పాటు తిరిగి మాపైనే కేసులు పెట్టారని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తున్నది.

రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ మాటల యుద్దం నడుస్తోంది. నల్లటి దుస్తులు వేసుకుని వస్తే అసెంబ్లీలోకి అనుమతించలేదని, పోలీసుల చేత దాడులు చేయించడంతో పాటు తిరిగి మాపైనే కేసులు పెట్టారని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తున్నది. అయితే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిని అసభ్యపదజాలంతో దూషిస్తారా? అంటూ మండపడుతోంది. ఈ క్రమంలోనే నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను దూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును ఇవాళ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటే నవీన్ రెడ్డిని సైతం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం స్పీకర్ చాంబర్‌లో గడ్డం ప్రసాద్ కుమార్‌‌ను సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాద పూర్వకంగా కలిశారు. అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం రోజున చోటుచేసుకున్న ఘటనలు, ఉద్రిక్తతల నేపథ్యంలో స్పీకర్‌ను కలిసి పరామర్శించారు. అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాలు, ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం, ఆవేదనను వ్యక్తం చేశారు. అనంతరం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను ఓదార్చిన సీఎం.. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని, బాధ్యులపై చట్టపరంగా తగిన తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం.

ఇదిలాఉండగా, నిన్న అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బ్లాక్ డ్రెస్ కోడ్‌తో గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాదయాత్రగా వచ్చి లోనికి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. నల్లదుస్తులు ధరించి, ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీలోనికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు.దీంతో కాసేపు ఇరువురికి వాగ్వాదం నెలకొంది.

దాంతో బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్, తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అక్కడే ఆందోళనకు సిద్దమవ్వగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట జరగగా పలువురికి గాయాలయ్యాయి. అందులో పోలీసులు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కాగా, రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలు అసభ్యకర పదజాలంతో దూషించారని కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తున్నది. దీనిపై నిన్న అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ చర్చ జరిపింది. స్పీకర్‌ కన్నీరు పెట్టుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తాతా మధును అరెస్టు చేసినట్టు తెలిసింది.

#cm revanth reddy#promise#speaker gaddam prasad kumar#mlc thata madhu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి