Naga Vamshi: టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో నాగ వంశీ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాడు. సినిమా ఈవెంట్స్‌లో ఆయన మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఏ నిర్మాత ఇంతగా వైరల్ అవలేదు. ఈ క్రమంలోనే మరోసారి హీరోయిన్సే చాలా బిజీగా ఉంటారని కామెంట్స్ చేసిన నాగవంశీ స్పై గా వెళ్ళి వాళ్ళ జీవితాలలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందన్నాడు.
కార్తి డ్యూయల్ రోల్ లో నటించిన సర్దార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్‌కి గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నాగ వంశీ.. హీరోయిన్స్ కి సినిమా గురించి కాల్ చేసినప్పుడు బిజీగా ఉన్నామని సమాధానమిస్తున్నారు. వాళ్ళు, నిజంగానే బిజీగా ఉండి అలా చెప్తున్నారా..లేక అవైడ్ చేయడానికి చెప్తున్నారా.. అనేది తెలియడం లేదు.
సినిమా హీరోయిన్స్ మాత్రమే బిజీగా ఉంటారా? మరి, డైరెక్టర్స్..హీరోలు అంత బిజీగా లేరు కదా..అని సరదాగా కామెంట్స్ చేశారు. అలాగే, నాగ వంశీ నిర్మించబోతున్న లేటెస్ట్ మూవీలో ఎంపికైన ఆషిక రంగనాథ్ మాత్రం అలా చెప్పదని అన్నాడు. ఇక, మాళవిక మోగన్ గురించి ప్రస్తావించి..ఆమె గురించి నాకు తెలియదన్నాడు. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో కార్తీ నటించిన సర్దార్ 2 ఈవెంట్‌లో జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇక, కార్తి గురించి కూడా నాగ వంశీ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. కార్తీ అన్న సూర్య నటించిన వీరభధ్రుడు సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేయగా భారీ హిట్ సాధించింది. ఆ తర్వాత, మా సితార సంస్థలో చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు, కార్తీ నటించిన సర్దార్ 2 కూడా అన్నపూర్ణ సంస్థ నుంచే రిలీజ్ కాబోతోంది. ఇది కూడా సూపర్ హిట్ అవ్వాలి. ఆ తర్వాత, మా బ్యానర్ లో సినిమా చేసి హిట్ కొట్టాలి..అని ధీమాను వ్యక్తం చేశాడు నాగ వంశీ.
కాగా, సర్దార్ 2 లో కార్తీ, ఆషిక రంగనాథ్..మాళవిక మోహనన్..ఎస్.జె.సూర్య, ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు-తమిళ భాషలలో సెప్టెంబర్ 10న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కార్తీ కామెంట్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఖైదీ 2 ఉంటుందా! అని అడిగిన ప్రశ్నకి..ఖచ్చితంగా ఉంటుంది..అంతకన్నా ముందు సర్దార్ 2 చూడండి అని చెప్పాడు. అలాగే, ఈ సినిమాలో హీరోయిన్స్ సాంగ్స్ కోసమో, గ్లామర్ కోసమో తీసుకోలేదు. మంచి యాక్షన్ సీక్వెన్స్‌లో నటించారు. మా హీరోయిన్స్ ఫైట్స్ చేస్తారని చెప్పుకొచ్చాడు. మొత్తానికి, సర్దార్ 2పై అంచనాలైతే పీక్స్‌లో ఉన్నాయి. కాగా, కార్తీ ఇందులో తండ్రీకొడులుగా నటించాడు.












