సినిమా

Anaswara Rajan: "కాకా" కూతురు ఫస్ట్ లుక్ రివీల్..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Anaswara Rajan: మెగాస్టార్ చిరంజీవి నటుస్తున్న లేటెస్ట్ సినిమా 'కాకా'. తాజాగా ఈ సినిమా నుంచి యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దీన్ని బట్టి ఈ మూవీ షూటింగ్ ఎంత స్పీడ్‌గా జరుగుతుందో అర్థం అవుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి భారీ మాసివ్ హిట్ ని మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన బాబీ దర్శకత్వంలో 'కాకా' తెరకెక్కుతోంది. గెటప్ శ్రీను, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. రియల్టర్ అయిన వెంకట్..డిస్ట్రిబ్యూటర్‌గా, ఆ తర్వాత నిర్మాతగా మారాడు. అయితే, నిర్మాతగా చేసిన సినిమాలన్నీ ఆయనకి తీవ్రంగా నష్టాలను తెచ్చిపెట్టాయి. ఇటీవల వచ్చిన యష్ టాక్సిక్ తో హిట్ కొట్టి కోలుకోవాలనుకున్నాడు. కానీ, ఈ సినిమా మరింతగా ఊబిలోకి లాగేసింది.

ఇప్పుడు, కేవిఎన్ ప్రొడక్షన్స్‌ని నష్టాల నుంచి బయటపడేసే బాధ్యత దర్శకుడు బాబి, హీరో చిరులపై ఉంది. ఇక, ఇటీవల 'కాకా' సినిమా టైటిల్ తో పాటు టీజర్ ని వదిలిన మేకర్స్..భారీ అంచనాలను పెంచేశారు. అంతేకాదు, 2027 సంక్రాంతికి జనవరి 13న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. కానీ, ఆ డేట్ కి 'విశ్వంభర' చిత్రాన్ని దింపే ఆలోచనలో మెగాస్టార్ అండ్ టీమ్ ఉందని వార్తలు వచ్చాయి.

కానీ, తాజాగా అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో వాటికి చెక్ పెట్టినట్టైంది. ఈ పోస్టర్‌లో అనస్వర్‌కి నీడలా వెన్నంటి ఉండేలా మెగాస్టార్.. తండ్రి పాత్రలో నటిస్తున్నట్టు హింట్ ఇచ్చారు. కంటికి రెప్పలా కూతురును కాపాడుకునేలా తండ్రీకూతుర్ల మధ్య బలమైన బాండింగ్ ఉంటుందని అర్థమవుతోంది. వాల్తేరు వీరయ్య మూవీలో అన్నదమ్ముల బంధాన్ని చెప్పిన బాబీ, 'కాకా'లో తండ్రీకూతుర్ల బంధాన్ని చెప్పనున్నాడు. ఇక, మరోసారి చెప్పిన తేదీకే (13.01.2027) 'కాకా' వస్తాడని పోస్టర్‌లో మెన్షన్ చేశారు. కాబట్టి, 'కాకా' సంక్రాంతి బరిలో ఉన్నాడు.

#Anaswara Rajan#Anaswara Rajan Look In Kaaka#Chiranjeevi#Bobby
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి