సినిమా

Suhas Controversy: రంగుతో పనేంటి భయ్యా? డైరెక్టర్ మతిమారన్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు!

రచన: Mahesh5 నిమిషాల పఠనం

Suhas Controversy: క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉంటూ పబ్లిక్ స్టేజ్‌లపై కల్లర్ ప్రస్తావన తీసుకురావడం సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీసింది. ‘మండాడి’ సక్సెస్ మీట్ వేదికగా టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ స్కిన్ టోన్, ఆయన ఎదుర్కొన్న కామెంట్స్ గురించి దర్శకుడు మతిమారన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు, ఆగ్రహానికి కారణమయ్యాయి.

Suhas Controversy: క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉంటూ పబ్లిక్ స్టేజ్‌లపై కల్లర్ ప్రస్తావన తీసుకురావడం సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీసింది. ‘మండాడి’ సక్సెస్ మీట్ వేదికగా టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ స్కిన్ టోన్, ఆయన ఎదుర్కొన్న కామెంట్స్ గురించి దర్శకుడు మతిమారన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు, ఆగ్రహానికి కారణమయ్యాయి.

వేదికపై కామెంట్స్.. నెట్టింట భగ్గుమన్న ఆగ్రహం

సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ మతిమారన్ మాట్లాడుతూ.. సుహాస్ ఎంతో టాలెంటెడ్ యాక్టర్ అయినప్పటికీ, గతంలో వర్ణ వివక్షతో కూడిన కామెంట్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందనే అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఈ క్రమంలో ఆయన మాట్లాడిన తీరు తెలుగు ప్రేక్షకులను, పరిశ్రమను కించపరిచేలా ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "కలర్ ఫోటో", "రైటర్ పద్మభూషణ్" వంటి సినిమాలతో తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సుహాస్ టాలెంట్‌ను చూడకుండా.. బహిరంగ వేదికపై రంగును తెరపైకి తేవడంపై టాలీవుడ్ ఆడియన్స్ సోషల్ మీడియా వేదికపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అసలు జరిగింది ఇదేనంటూ డైరెక్టర్ క్లారిటీ..

వివాదం మరింత ముదురుతుండటంతో దర్శకుడు మతిమారన్ అధికారికంగా వివరణ ఇచ్చారు. తన కామెంట్స్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. "సుహాస్ తన కల్లర్ కారణంగా ఎదుర్కొన్న వివక్షాపూరిత కామెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు.. నేను ఒక వ్యక్తి మాత్రమే చేసిన కామెంట్స్‌ను ఉద్దేశించి మాట్లాడాను తప్ప, మొత్తం తెలుగు ప్రజలనో, తెలుగు ప్రేక్షకులనో లేదా తెలుగు పరిశ్రమనో ఉద్దేశించి కాదు" అని వివరణ ఇచ్చారు.

"హైదరాబాద్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోనే చెప్పాను.. ప్రస్తుతం దేశంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ అగ్రగామిగా నిలిచింది. తెలుగు సినిమా, ఇక్కడి ప్రేక్షకులంటే నాకు అపారమైన గౌరవం ఉంది. 'మండాడి' చిత్రానికి, నాకు ఇంతటి ప్రేమాభిమానాలు అందించిన వారిని కించపరిచే ఉద్దేశం నాకు ఏనాడూ ఉండదు" అని చెప్పుకొచ్చారు.

"నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే, తప్పుగా అర్థం చేసుకోని ఉంటే చింతిస్తున్నాను. నేను సుహాస్‌కు సపోర్ట్‌గా, అతడిని బాధించిన ఒకరి కామెంట్స్ గురించే మాట్లాడాను తప్ప, ఎవరినీ కించపరచాలని కాదు" అని క్లారిటీ ఇచ్చారు.

మొత్తానికి సుహాస్‌కు మద్దతుగా మాట్లాడబోయి మాట జారడంతో మొదలైన ఈ రగడ.. డైరెక్టర్ మతిమారన్ స్వయంగా వివరణ ఇవ్వడం, తెలుగు ప్రేక్షకులపై తనకున్న గౌరవాన్ని పునరుద్ఘాటించడంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది. అయిన కూడా ఒక స్థాయిలో ఉన్న వాళ్లు బహిరంగ వేదికలపై ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది ఆలోచించకుండా కామెంట్స్ చేస్తే తర్వాత పర్యవసాలను ఎలా ఉంటాయనే దానికి ఈ ఘటన చక్కటి ఉదాహరణగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.

#Suhas#Suhas Controversy#Suhas Latest News#Suhas Controversy Telugu#Suhas Skin Tone Controversy#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి