తెలంగాణ

Congress : ఖైరతాబాద్ బై పోల్.. బరిలో నిలిచేది ఎవరో చెప్పిన టీపీసీసీ చీఫ్!

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ ఫిరాయింపుల అంశంలో హైకోర్టు వెలువరించిన తీర్పును ఆయన స్వాగతించారు. అయితే, ఈ తీర్పు కాంగ్రెస్ సర్కారుకు చెంపపెట్టు కాదని, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ ఫిరాయింపుల అంశంలో హైకోర్టు వెలువరించిన తీర్పును ఆయన స్వాగతించారు. అయితే, ఈ తీర్పు కాంగ్రెస్ సర్కారుకు చెంపపెట్టు కాదని, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వర్తిస్తుందని పేర్కొన్నారు.

శనివారం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. దానం నాగేందర్ సభ్యత్వం రద్దు, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పష్టత ఇచ్చారు.‘దానం’ వ్యవహారంలో హైకోర్టు తీర్పును తాము పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి ఫిరాయింపులు జరగలేదన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమం, ప్రజా పాలన, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మాత్రమే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.

ఇక ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. ఎమ్మెల్యే సభ్యత్వం కోల్పోయిన దానం నాగేందర్ తిరిగి ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో నిలుస్తారా? లేదా? అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలించి నిర్ణయిస్తుందని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపుల సంస్కృతిని రాష్ట్రంలో ప్రోత్సహించిందే ప్రతిపక్ష బీఆర్ఎస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేసే తమ పార్టీలో విలీనం చేసుకున్నారో ప్రజలందరికీ స్పష్టంగా తెలుసునని గుర్తుచేశారు. అంతటి అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు నీతులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవాచేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రాజ్యాంగబద్ధంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని స్పష్టంచేశారు. ఉప ఎన్నికలో ప్రజా తీర్పు మళ్లీ తమకే అనుకూలంగా ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ జోస్యం చెప్పారు.ఇదిలాఉండగా, దానం నాగేందర్ అనర్హత అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

#Congress#danam nagender#Tpcc cheif mahesh goud#by poll#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి