Sai Abhyankar: రాకా..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ వరల్డ్ సినిమా. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌కి సంబందించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ముందు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌ని అనుకున్నారట. కానీ, చివరికి సాయి అభ్యంకర్ ఫైనల్ అయినట్టుగా తెలిసింది.
పుష్ప ఫ్రాంఛైజీస్‌తో అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పాన్ ఇండియా వైడ్‌గా పెరిగిపోయింది. పుష్ప 2తో 2000 కోట్ల మార్కెట్‌ని టచ్ చేసి అవార్డులను అందుకున్నాడు అల్లు అర్జున్. అయితే, ఇంతటి భారీ చిత్రం తర్వాత నెక్స్ట్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడో అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. వాస్తవానికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయాల్సింది.
కానీ, ఎప్పుడైతే..వరుసగా అల్లు అర్జున్.. అట్లీ. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసెఫ్‌లను లైన్‌లో పెట్టాడో..ఇక త్రివిక్రమ్ కి ఇప్పట్లో అల్లు అర్జున్ దొరకడని అర్థం అయిపోయింది. దాంతో, ఆయన వెంకటేష్‌తో ఆదర్శ కుటుంబం, ఎన్‌టిర్‌తో గాడ్ ఆఫ్ వార్ సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇదిలా ఉంటే పుష్ప సిరీస్‌కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా..రాకా చిత్రానికి అనిరుధ్ ఫిక్సవుతాడనుకున్నారు. కానీ, అది జరగలేదు.
ఆ తర్వాత, ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్న మరో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ని పరిశీలించారట. చివరికి, సాయి అభ్యంకర్ పేరును నిర్మాత కళానిధి మారన్ స్వయంగా అట్లీకి రిఫర్ చేయడంతో ప్రాజెక్ట్‌లోకి వచ్చినట్టుగా తెలిసింది. మరి, ఈ సినిమాకి సాయి ఎలాంటి సాంగ్స్, బీజీఎం ఇస్తాడో చూడాలి. ఇక, ఇందులో..బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో మృణాల్ ఠాకూర్..జాన్వీ కపూర్ కనిపించబోతున్నారు.












