తెలంగాణ

TG : ఈ భూములు మీవేనా? ప్రూవ్ చేస్కోండి.. ఎర్రవల్లి రైతులకు నోటీసులు!

రచన: Kumar5 నిమిషాల పఠనం

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క ఆదేశం ఎర్రవల్లి రైతులకు కొత్త ఇబ్బందులను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో సుమారు 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని, అధికారులు వెంటనే సర్వే చేసి లెక్కలు తేల్చి వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క ఆదేశం ఎర్రవల్లి రైతులకు కొత్త ఇబ్బందులను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో సుమారు 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని, అధికారులు వెంటనే సర్వే చేసి లెక్కలు తేల్చి వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. గత రెండు, మూడు రోజులుగా రెవెన్యూ అధికారులు ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం పరిసరాల్లో సర్వేలు చేస్తున్నారు. మర్కూక్ మండలం ఆఫీసులో ముందుగా రికార్డులు పరిశీలించిన అధికారులు.. భూముల లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.

ముందుగా ఎర్రవల్లి కేసీఆర్ ఫౌంహౌస్ పరిసరాల్లో సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులను స్థానిక రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. కేసీఆర్ తమ భూములు లాక్కోలేదని, తామే వ్యవసాయం చేసుకుంటున్నామని అధికారులకు వెల్లడించారు. అవన్నీ అసైన్డ్ భూములు అని తమకు ప్రభుత్వం అందజేసిన పట్టా కాగితాలు ఉన్నాయని పేర్కొన్నారు.దీంతో వెనక్కి వెళ్లిన అధికారులు మరల సర్వే చేపట్టారు.

ఈ క్రమంలోనే తాజాగా దళిత రైతులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవెల్లిలో సర్వే పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు నోటీసులు ఇవ్వడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ భూమి మీదే అని నిరూపించుకునేందుకు ఆధారాలు చూపాలని అధికారులు నోటీసులు ఇస్తున్నారని దళిత రైతులు మండిపడుతున్నారు.కాగా, ఎన్నో ఏండ్ల నుండి తాము సాగు చేసుకుంటున్న భూమిని సీఎం రేవంత్ రెడ్డి లాక్కుని వేరే వాళ్లకి ఇస్తాడేమోనని స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నట్టు సమాచారం.

కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం దళిత రైతుల మీద పగ తీర్చుకుంటున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో అసైన్డ్ భూములు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఉన్న దళితుల భూములు లాక్కునే కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అధికారులు సైతం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో సర్వే చేయకుండా.. వ్యవసాయ క్షేత్రానికి 1 కిలోమీటర్ దూరంలో చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

కాగా, వ్యవసాయ క్షేత్రంలో ఉన్న భూమి మొత్తం కేసీఆర్ రైతుల నుంచి న్యాయపరంగా కొనుక్కున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అవసరమైతే కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? అని సవాల్ సైతం విసిరారు.దీనిపై సీఎం రేవంత్ నుంచి ఇంతవరకూ స్పందన రాలేదు.

#erravalli formhouse#kcr#govt lands#cm revanth#notice#farmers#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి