తెలంగాణ

TG : పేదల ఇండ్ల కూల్చివేతకు నోటీసులు.. ఖమ్మంలో హైటెన్షన్

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఖమ్మం జిల్లాలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారంటూ మున్సిపల్ అధికారులు స్థానికులకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బాధితులు అంతా ఒక్కసారి రోడ్డు మీదకు వచ్చారు.

ఖమ్మం జిల్లాలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారంటూ మున్సిపల్ అధికారులు స్థానికులకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బాధితులు అంతా ఒక్కసారి రోడ్డు మీదకు వచ్చారు. ఈ ఘటనతో శ్రీనివాస నగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్యాయంగా తమ ఇండ్లను ఎలా కూలుస్తారంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ సర్కార్ పేదల ఇండ్లను కూల్చి భూములు లాక్కోవాలని చూస్తున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే స్థానికులు మీడియాతో తమ గోడును వెల్లిబుచ్చారు. ‘నోటీసులు వచ్చి నెలరోజులు అయితే మాకు చెప్పకుండా ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఖాళీ చేయండి అంటున్నారు . మా ఇల్లు వదిలి మేము ఎక్కడికి పోము.. సచ్చినా, బ్రతికినా ఇక్కడే ఉంటాము. ఓట్ల కోసం కాంగ్రెస్ వాళ్ళు అమ్మ అయ్యా అంటూ వచ్చి కాళ్ళు పట్టుకుంటారు.. కానీ, మొన్న ధర్నా చేస్తే మా బాధ ఏంటని ఒక్కరు కూడా అడగలేదు’ అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.ఇదే విషయంలో మరో యువకుడు సైతం స్పందించాడు. ‘ఉన్న ఈ చిన్న గుడిసె కూడా తీసేస్తే.. మేము ఎక్కడికి పోవాలి?

అసలు మేము ఇల్లు ఎందుకు తీసేయాలి.. మాకు పట్టా ఉంది. మా ఇళ్ల జోలికి ఎవడు వస్తాడో చూస్తా. ఏ ప్రభుత్వం మా జోలికి రాలేదు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇలా అవుతుంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో శ్రీనివాస నగర్ కాలనీ వాసులు తమకు న్యాయం చేయాలని విజయవాడ, హైదరాబాద్ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, పేదల ఇండ్ల కూల్చివేత కోసం ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితులు ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా ప్రజలు రోడ్డు మీదకు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో పేద ప్రజలకు న్యాయం జరగడం లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

#kammam#people#houses#notices#demolish#municipal offficers#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి