సినిమా

Tollywood: వీఎఫెక్స్ వల్ల ఆలస్యం అవుతున్న సినిమాలు..దర్శకులకి పెద్ద పరీక్షే!

రచన: Anshu6 నిమిషాల పఠనం

Tollywood: గతంలో సినిమా షూటింగ్ పూర్తయితే, విడుదలకు పెద్దగా సమయం పట్టేది కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌, పీరియాడిక్‌, ఫాంటసీ, యాక్షన్‌, సోషియో-ఫాంటసీ సినిమాల విషయంలో షూటింగ్ పూర్తయిన తర్వాతే అసలు పెద్ద పని మొదలవుతోంది.

Tollywood: గతంలో సినిమా షూటింగ్ పూర్తయితే, విడుదలకు పెద్దగా సమయం పట్టేది కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌, పీరియాడిక్‌, ఫాంటసీ, యాక్షన్‌, సోషియో-ఫాంటసీ సినిమాల విషయంలో షూటింగ్ పూర్తయిన తర్వాతే అసలు పెద్ద పని మొదలవుతోంది. వందల నుంచి వేల సంఖ్యలో వీఎఫెక్స్‌ షాట్లను పూర్తి చేయడం, వాటిని రీ-వర్క్‌ చేయడం, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, కంపోజిటింగ్‌, కలర్‌ గ్రేడింగ్‌, సౌండ్‌ డిజైన్‌ వంటి పనులను పూర్తి చేయడానికి నెలల సమయం పడుతోంది. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కుంటున్న సినిమాలే విశ్వంభర, స్వయంభు.

దీంతో విడుదల తేదీలు ప్రకటించిన తర్వాత కూడా సినిమాలు వాయిదా పడుతున్నాయి. కొన్నిసార్లు విడుదల తేదీ మారడమే కాదు.. కొత్త తేదీని ప్రకటించడానికి కూడా చిత్రబృందాలు వెనుకడుగు వేస్తున్నాయి. 2026లోనూ ఈ పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో కొన్ని భారీ చిత్రాలు వీఎఫెక్స్‌ పనుల కారణంగా ఆలస్యమవుతున్నాయి. దీనికి, ఓటీటీల ఒత్తిడి కూడా తోడవుతోంది.

‘భోగి’.. వీఎఫెక్స్‌ కోసం విడుదల వాయిదా.!

శర్వానంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోగి’ ఇందుకు తాజా ఉదాహరణ. ఆగస్టు 28న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని మేకర్స్‌ వాయిదా వేశారు. కారణం కూడా స్పష్టంగానే చెప్పారు.

క్లైమాక్స్‌ షూటింగ్‌ పూర్తయినప్పటికీ వీఎఫెక్స్‌ పనులు ఇంకా కొనసాగుతున్నాయని, సినిమాలోని పీరియాడికల్‌ ప్రపంచాన్ని, యాక్షన్‌ సన్నివేశాలను మరింత ప్రభావవంతంగా తెరపై చూపించేందుకు అదనపు సమయం అవసరమైందని చిత్రబృందం వెల్లడించింది. కొత్త విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.

ఇక్కడ దర్శకుడి ముందు ఉన్న సవాలు స్పష్టంగా కనిపిస్తుంది. షూటింగ్ పూర్తయింది కాబట్టి సినిమాను వెంటనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఒక మార్గం. కానీ తాను ఊహించిన విజువల్‌ ప్రపంచం తెరపై సరిగ్గా కనిపించాలంటే మరికొంత సమయం ఇవ్వడం మరో మార్గం. ‘భోగి’ విషయంలో రెండో మార్గాన్నే చిత్రబృందం ఎంచుకుంది.

‘విశ్వంభర’.. మూడేళ్ల నుంచి ప్రొడక్షన్స్‌లోనే!

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ పరిస్థితి ఇలాగే ఉంది. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో-ఫాంటసీ చిత్రానికి భారీ స్థాయిలో గ్రాఫిక్స్‌, వీఎఫెక్స్‌ అవసరమని మేకర్స్ వెల్లడించారు. 2026 సెప్టెంబర్‌ వరకూ కూడా ఈ సినిమాకు ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటించలేదు. ‘విశ్వంభర’ ఆలస్యానికి గ్రాఫిక్స్‌, వీఎఫెక్స్‌ పనులే కారణమని ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు విడుదల తేదీపై స్పష్టత లేకపోవడం ఓటీటీ డీల్స్‌పైనా ప్రభావం చూపుతోందని సమాచారం.

‘స్వయంభు’.. 2700 వీఎఫెక్స్‌ షాట్లతో భారీ పోస్ట్‌ ప్రొడక్షన్‌:

నిఖిల్‌ సిద్ధార్థ నటిస్తున్న ‘స్వయంభు’ కూడా వీఎఫెక్స్‌ పరంగా భారీ ప్రాజెక్ట్‌గా మారింది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు దాదాపు 2,700 వీఎఫెక్స్‌ షాట్లు ఉన్నట్లు తాజా సమాచారం.

నిఖిల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, 2025 డిసెంబర్‌లో ప్రధాన షూటింగ్‌ పూర్తయినా.. ఆ తర్వాత ఐదు నుంచి ఆరు నెలలుగా గ్రాఫిక్స్‌, వీఎఫెక్స్‌ పనులపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ప్రేక్షకులు ఇప్పుడు విజువల్స్‌లో చిన్న తప్పును కూడా గుర్తించే స్థాయిలో ఉన్నారు. దాంతో, అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడానికి భారీగా కష్టపడుతున్నామని ఆయన తెలిపారు.

నాని ‘ది ప్యారడైజ్’.. చివరి నిమిషంలో వీఎఫెక్స్‌ ఒత్తిడి:

నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్‌’ విషయంలోనూ వీఎఫెక్స్‌ కారణంగా విడుదల వాయిదా పడొచ్చనే వార్తలు సెప్టెంబర్‌లో హల్‌చల్‌ చేశాయి. సినిమాలోని క్లైమాక్స్‌ భారీగా CG పైనే ఆధారపడి ఉందని, కొంత పోస్ట్‌ ప్రొడక్షన్‌ పని పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్‌ 24 విడుదల చేయబోతున్నారు.

#The Paradise#Swayambhu#Vishwambhara#Bhogi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి