తెలంగాణ

KTR: పాలమూరు రైతులకు సీఎం రేవంత్ తీవ్ర అన్యాయం- కేటీఆర్

రచన: NK5 నిమిషాల పఠనం

KTR: పాలమూరు రైతులకు సీఎం రేవంత్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పాలమూరు బిడ్డ పాలమూరు రైతు నోట్లో మట్టి కొట్టి నీళ్లు కిందికి వదిలాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. సీఎం రేవంత్ గురుదక్షిణ కింద పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు వదిలారని అన్నారు. గురువుకు 100 టీఎంసీల నీరు ఇస్తే.. జూరాల రైతులకు 18 టీఎంసీల నీరే ఇచ్చారని చెప్పారు.

KTR: పాలమూరు రైతులకు సీఎం రేవంత్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పాలమూరు బిడ్డ పాలమూరు రైతు నోట్లో మట్టి కొట్టి నీళ్లు కిందికి వదిలాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. సీఎం రేవంత్ గురుదక్షిణ కింద పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు వదిలారని అన్నారు. గురువుకు 100 టీఎంసీల నీరు ఇస్తే.. జూరాల రైతులకు 18 టీఎంసీల నీరే ఇచ్చారని చెప్పారు.

వనపర్తి జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. గుమ్మడం, పెబ్బేరు సబ్ స్టేషన్లు పరిశీలించారు. కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ వాపోయారు. నీళ్లు ఉండి కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ సర్కార్‌ది అని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో అన్నీ సమయానకి వచ్చేవని గుర్తు చేసిన కేటీఆర్.. రేవంత్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఇప్పుడు రైతుబంధు రావడం లేదు, యూరియా కూడా దొరకడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా 12 గంటల కరెంట్ రావడం లేదన్నారు.

''కల్వకుర్తి లిఫ్ట్ లను కాంగ్రెస్ సర్కార్ నడపటం లేదు. పైన కర్నాటక వాళ్లు ఆలోచన చేసుకున్నారు నీళ్లు నింపి పెట్టుకున్నారు. కింద ఆంధ్రా వాళ్లు కూడా బ్రహ్మాండంగా నీళ్లు వాడుకుంటున్నారు. శ్రీశైలం నుంచి తోడుకుంటున్నారు. ఆంధ్రాలో పట్టిసీమ పంపులు ఆన్ చేశారు. తెలంగాణలో కన్నెపల్లి పంపు హౌస్ లో గోదావరి నీళ్లు ఆన్ చేయకపోయినా ఆంధ్రాలో పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు వెలిగొండ ద్వారా కూడా నీళ్లు తీసుకుంటున్నారు.

అటు కర్నాటక, ఇటు ఏపీ ప్రభుత్వం చేస్తున్న పని రేవంత్ సర్కార్ ఎందుకు చేయలేకపోతోంది? ఎల్ నినో ఒక్క తెలంగాణలోనే ఉందా? కర్నాటక, ఆంధ్రాలో లేదా? ఆరుసార్లు ఇవ్వాల్సిన రైతుబంధును మూడుసార్లు ఎగ్గొట్టారు. రైతు బీమాను ఎగ్గొట్టారు. ఏడాదిన్నర తర్వాత కేసీఆర్ వస్తారు, అప్పుడే తెలంగాణ ప్రజలు, రైతుల కష్టాలన్నీ తీరుతాయి'' అని కేటీఆర్ అన్నారు.

పాలమూరు రైతులను రేవంత్ రెడ్డి తొక్కుతున్నారు. నీళ్లు ఇవ్వకుండా రైతుల బతుకులు ఆగం చేస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు. పెబ్బేరు పట్టణ పరిధిలో వెయ్యి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్. రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి లేదు. తనఖా పెట్టడానికి లేదు. రైతుబంధు రాదు, వ్యవసాయం చేసుకోవడానికి కూడా లేదు.

రేవంత్ కి గురువు చంద్రబాబు అంటే భయం. కేసులు ఉన్నాయి కదా. శ్రీశైలం నుంచి పుష్కలంగా వందల టీఎంసీల నీళ్లు కిందకి పంపుతున్నారు. పైన ఉండే పాలమూరుకి మాత్రం నీళ్లు ఇవ్వడం లేదు. గురువుకు 100 టీఎంసీలు, జూరాల రైతులకు 18 టీఎంసీలు ఇచ్చారు. జూరాల ఆయకట్టులో ఒక్క ఎకరం ఎండినా దానికి కచ్చితంగా రేవంత్ బాధ్యత తీసుకోవాలి. రేవంత్ ను వదిలేది లేదు'' అని కేటీఆర్ హెచ్చరించారు.

#KTR#Brs#Palamooru#Farmers#Cm Revanth Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి