Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ మొత్తంగా చూసుకుంటే ఎప్పటికప్పుడు హీరోయిన్ స్థానం మారుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఒకరిని నంబర్ 1 హీరోయిన్ అని చెప్పడానికి లేదు. 2026లో ‘టాలీవుడ్ నుంచి గనక చూసుకుంటే నంబర్ 1 హీరోయిన్’ గా స్టార్‌డమ్, పాన్-ఇండియా క్రేజ్, పెద్ద సినిమాలు, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలను కలిపి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది.
ఆ రకంగా చూస్తే నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు ముందువరుసలో కనిపిస్తుంది. ఆమెను దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే ప్రముఖ నటీమణుల్లో ఒకరిగా తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.
అయితే, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పోటీ చాలా ఎక్కువగా ఉంది. మీనాక్షి చౌదరి, భాగ్యశ్రీ బోర్సే, కాయదు లోహర్, మమితా బైజు, శ్రీనిధి శెట్టి వంటి కొత్త తరం హీరోయిన్లు కూడా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో స్టార్స్ పక్కన అవకాశాలను అందుకుంటున్నారు.
ఇక, ఒకే ఒక్క పేరు మాత్రమే చెప్పాలంటే.. సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌తో ఉన్న రష్మిక మందన్న గురించి చెప్పాలి. అయితే, రష్మిక కంటే కూడా పాన్ వరల్డ్ స్థాయిలో చూసుకుంటే, ప్రియాంక చోప్రా, దీపిక పడుకొణె లాంటి వారు ముందున్నారు. ఇక్కడ, ప్రధానంగా చూసేది సక్సెస్ రేట్ మాత్రమే. ఒక హీరోయిన్‌కి వరుసగా హిట్స్ పడుతుంటే..మేకర్స్ అందరూ ఆమెకే ఛాన్సులు ఇస్తుంటారు.
అలా, ఇప్పటికే టాలీవుడ్‌లో వరుసగా హిట్స్ అందుకున్న హీరోయిన్స్ తమిళంతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ గొప్ప అవకాశాలను అందుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో సౌత్ నుంచి బాలీవుడ్‌కి వెళ్ళిన వారిలో రష్మిక తర్వాత..కీర్తి సురేష్, శ్రీలీల, నయనతార, ప్రియమణి, సాయి పల్లవి లాంటి వారున్నారు. కానీ, ఎక్కువగా అక్కడ పాపులారిటీని దక్కించుకుంది మాత్రం రష్మిక మందన్ననే. మిగతా వాళ్ళు ఇంకా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.









