Srikanth Odela: సినిమా అనేది కంప్లీట్‌గా క్రియేటివ్ మైండ్‌తో చేయాల్సిన పని. మానసిక ఒత్తిడితో పాటు శారీరక శ్రమ కూడా చాలా ఉంటుంది. ఒక కథ అనుకున్న తర్వాత అది పూర్తి స్థాయిలో సిద్ధం చేసి మేకర్స్‌ని ఒప్పించి..హీరోని ఒప్పించి సెట్స్ మీదకి తీసుకురావదం పెద్ద ఛాలెంజ్. ఇక, అక్కడ నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకూ చాలా ఒత్తిడి ఉంటుంది. అందుకే, సినిమా అయ్యాక దర్శకుడు..హీరో కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. శ్రీకాంత్ ఓదెల కూడా 3 నెలలు రెస్ట్ తీసుకోనున్నట్టుగా వెల్లడించాడు.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు ది ప్యారడైజ్ అనే సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా 7 భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం, జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో కీర్తి సురేష్ స్పెషల్ నంబర్‌లో ఆడిపాడింది. ఏష నాగుల అంటూ వచ్చిన ఈ డాన్స్ నంబర్‌తో సినిమాపై విపరీతంగా హైప్ పెరిగింది.
మంచు మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక, ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీకాంత్ ఓదెల ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ప్యారడైజ్ రిలీజైయాక తాను 3 నెలలు పాటు రెస్ట్ తీసుకోనున్నట్టుగా వెల్లడించాడు. ఆ తర్వాతే, మెగాస్టార్ చిరంజీవి సినిమాపై వర్క్ స్టార్ట్ చేయనున్నట్టుగా తెలిపాడు.
అయితే, ఈ గ్యాప్‌లో చిరంజీవి కూడా కాకా, విశ్వంభర చిత్రాలను పూర్తి చేసి ఆయన కూడా కాస్త రెస్ట్ తీసుకుంటాడా లేక ఇంకో సినిమా షూట్ లో జాయిన్ అవుతాడా అనేది చిరు ఇష్టం అని కూడా శ్రీకాంత్ తెలిపాడు. నేను మాత్రం 3 నెలలు బ్రేక్ తీసుకుంటాననే విషయాన్ని చిరుకి ముందుగానే చెప్పానని శ్రీకాంత్ ఓదెల అన్నాడు. మొత్తానికి, ప్యారడైజ్ సినిమాతో బాగా అలిసిపోయిన ఈ డైరెక్టర్ 3 నెలల తర్వాతే చిరు సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్‌ను స్టార్ట్ చేయనున్నాడని క్లారిటీ వచ్చింది.












