క్రైమ్

Crime : ఢిల్లీలో మరో ‘నిర్భయ’ ఘటన..కదిలే టెంపోలో గ్యాంగ్ రేప్!

రచన: Kumar4 నిమిషాల పఠనం

దేశరాజధానిలో ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఢిల్లీ పరిసరాల్లో మరో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు హత్య చేశారు దుండగులు. ఇటీవలే కదిలే బస్సులో ఓ మైనర్‌పై డ్రైవర్, కండక్టర్ దారుణానికి పాల్పడిన విషయం తెలిసిందే.

దేశరాజధానిలో ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఢిల్లీ పరిసరాల్లో మరో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు హత్య చేశారు దుండగులు. ఇటీవలే కదిలే బస్సులో ఓ మైనర్‌పై డ్రైవర్, కండక్టర్ దారుణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది.ఇంట్లో గొడవ పెట్టుకుని ఢిల్లీలోని బంధువుల ఇంటికి బయలుదేరిన ఓ బాలిక ఓ ప్రయివేటు ట్రావెల్ బస్సు ఎక్కగా.. అందులోని డ్రైవర్, కండక్టర్ ఆమె మీద లైంగిక దాడికి పాల్పడి ఓ బస్టాండులో వదిలేసి పరార్ అయ్యారు. బాధితురాలి కుటుంబీకులు ఆలస్యంగా ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

తాజా ఘటన మాత్రం అందుకు భిన్నం..కదులుతున్న టెంపోలో 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు సమాచారం. అత్యాచారం చేసిన అనంతరం బాధితురాలిని చంపేసి, శవాన్ని పొలాల్లో విసిరేసినట్టు తెలిసింది.నలుగురు నిందితులు ఈ దారుణానికి పాల్పడగా.. అందులో ముగ్గురు మైనర్లు ఉన్నట్టు తెలిసింది. నిందితులంతా బాధితురాలికి పరిచయస్తులే కావడం గమనార్హం.

వివరాల్లోకివెళితే.. సెప్టెంబర్ 1వ తేదీన తన స్నేహితుడిని కలిసేందుకు బయటికి వెళ్లిన ఓ బాలికను మరో స్నేహితుడు టెంపోలో ఎక్కించుకున్నాడు. అప్పటికే టెంపోలో మరో ముగ్గురు ఉన్నట్టు సమాచారం.ప్లాన్ ప్రకారమే మొత్తం నలుగురు కలిసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలిసింది. అనంతరం బాలికను కత్తితో పొడిచి చంపేసి ఢిల్లీ శివారులోని పొలాల్లో మృతదేహాన్ని విసిరేసి నిందితులు పరార్ అయ్యారు. బాలిక కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు ఫైల్ చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే ఢిల్లీ–స్వరూప్ నగర్ ప్రాంతంలోని కుషాక్ రోడ్‌లోని పొలాల్లో ఈ నెల 13న దయనీయ స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. వీధి కుక్కలు పీక్కుతినడంతో పక్కనే తెగిపోయి ఉన్న చేయి చూసి 17 ఏళ్ల బాలిక మృతదేహంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా బాలికపై గ్యాంగ్ రేప్, హత్య జరిగినట్టు గుర్తించారు.టెంపో నంబర్ ప్లేట్ ఆధారంగా ప్రధాన నిందితుడు శివమ్‌తో పాటు మరో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

#delhi#nirbaya case#gangrape#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి