తెలంగాణ

TG : సీఎం నాతో ఇదే చెప్పారు.. అదే చేస్తా : దానం నాగేందర్

రచన: Kumar4 నిమిషాల పఠనం

అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు నిచ్చిన విషయం తెలిసిందే.ఈ విషయంలో తనకు నెగెటివ్ తీర్పు వస్తుందని ఆయన కూడా ఊహించలేదని తెలిసింది.

అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు నిచ్చిన విషయం తెలిసిందే.ఈ విషయంలో తనకు నెగెటివ్ తీర్పు వస్తుందని ఆయన కూడా ఊహించలేదని తెలిసింది. దీంతో కొంత నిరాశకు గురైన దానం నాగేందర్.. శనివారం మరోసారి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు ఆయన సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేయగా.. అప్పీల్‌కు వెళ్తారా? అని మీడియా ప్రతినిధులు అడుగగా.. సుప్రీంకోర్టుకు వెళ్లేది లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఎందుకంటే ఆయన ఫిరాయింపులకు పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు కళ్లెదుటే ఉండటం, అక్కడ కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉండని న్యాయ నిపుణులు హెచ్చరించడంతో దానం నాగేందర్ వెనక్కి తగ్గినట్టు తెలిసింది. మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడగా.. అందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాత్రమే కాంగ్రెస్ పార్టీ బీఫాం మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఎంపీగా పోటీ చేసిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. అదే ఆయన కొంపముంచిందని ప్రచారం జరుగుతోంది.

మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి సొంత పార్టీ గూటికి చేరారు. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీ బీఫాంతో ఎన్నికలకు పోలేదు. కేవలం పార్టీ కండువాలు కప్పుకుని అధికార పార్టీలో కొనసాగుతున్నారు.వీరు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు బలమైన సాక్ష్యాలు లేవు. వీరంతా ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నట్టు అసెంబ్లీ రికార్డ్స్ చెబుతున్నాయి.దీంతోవారంతా ఊపిరి పీల్చుకున్నట్టు తెలిసింది.

ఇదిలాఉండగా,తన ఎమ్మెల్యే పదవి పోవడంపై దానం నాగేందర్ శనివారం మీడియాతో మట్లాడుతూ.. సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా? అనేది స్పీకర్ నిర్ణయమని స్పష్టంచేశారు. ఎందుకంటే ఫిరాయింపులపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఆధారంగానే తీర్పు కాపీ వచ్చిందని , తాను ఆర్డర్ కాపీని పూర్తిగా చదివానని చెప్పారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పిన దానం.. ‘నువ్వు ఫైటర్.. ఫైట్ చేద్దామని’ సీఎం తనతో అన్నారని పేర్కొన్నారు. తనకు ఎన్నికలు కొత్త కాదని, ఎన్నికల్లో కొట్లాడటానికి ఇష్టపడతానని, కార్యకర్తలకు కూడా ఇదే విషయం చెప్పానన్నారు. ఉపఎన్నిక కోసం తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడింాచురు.

#danam nagender#disqualify#defected mla#congress#cm revanth reddy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి