ఐఫోన్ అంటే కొందరికి అమితమైన ఇష్టం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన బ్రాండ్ కావడంతో దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా భారతీయులకు ఐఫోన్‌తో విడదీయని బంధం ఏర్పడింది. ఒకప్పుడు ఐఫోన్ అంటే కేవలం డబ్బులు ఉన్నవారి దగ్గరే ఉండేదనే భావన ఉంది. కానీ, ఇప్పుడు సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం యాపిల్ ఫోన్స్ వాడుతున్నారు. టెక్నాలజీ ఎక్కువగా వినియోగించే వారు తప్పకుండా ఐఫోన్ క్యారీ చేస్తున్నారు. ఎందుకంటే ఐఫోన్‌లో తీసే ఫొటోలు అంత క్లారిటీగా ఉంటాయి. హెచ్‌డీ కెమెరాలకు తీసిపోని విధంగా పిక్చర్స్ క్యాప్చర్ చేయడం దాని సొంతం.
అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఐఫోన్స్ వినియోగిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఐటీ ఉద్యోగులు ప్రతి నలుగురిలో ఒకరు ఐఫోన్ వాడటం కామన్ అయిపోయింది.కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని మీ డ్రీమ్ ఏంటని అడిగితే మొదటి సాలరీతో ఐ ఫోన్ కొనుగోలు చేయాలని చెప్పిన వారూ ఉన్నారు. ఐఫోన్ కొనివ్వలేదని విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలూ ఉన్నాయి. మరి ఐఫోన్స్‌కు అంతటి క్రేజ్ ఎందుకు వచ్చిందటే.. అందులోని సెక్యూరిటీ ఫీచర్స్. థర్డ్ పార్టీ యాప్స్ అందులో సపోర్టు చేయవు. తద్వారా మాల్వేర్ చొప్పించడం కష్టం.స్పామ్ కాల్స్‌ను గుర్తిస్తుంది. ఫ్రాడ్ రిలేటెడ్ అలర్ట్స్ ఇస్తుంటుంది.
ఇక ఐఫోన్ వాడుతున్న వారి ఫోన్ ట్యాపింగ్ చేస్తే కూడా యూజర్‌కు అలర్ట్ వెళ్తుంది.ఫోన్ పోయిన అందులోని సెక్యూరిటీ ఫీచర్స్ ఆధారంగా ఇట్టే పట్టేయచ్చు. ఐఫోన్ వాడుతున్నారంటే వారి పట్ల ఎదుటివారి అభిప్రాయమూ మారిపోతుంటుంది. అందుకే కొందరు పేరు మర్యాదలు, గౌరవం కోసం యాపిల్ ఫోన్ వినియోగిస్తుంటే.. మరికొందరు కెమెరా, సెక్యూరిటీ ఫీచర్స్.. మరికొందరు బ్రాండ్ కోసం వినియోగిస్తున్నట్టు సమాచారం.
బిజినెస్‌మెన్స్, రాజకీయ నాయకులు, ఇన్ ఫ్లూయెన్సర్ ఇలా చాలా మంది ఐఫోన్ యూజర్లుగా ఉన్నారు.అందుకే మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చిందంటే చాలు ఎగబడుతుంటారు.తాజాగా ‘ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్’ సిరీస్ మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇంకేముంది తమ పాత యాపిల్ ఫోన్లు ఎక్స్ఛేంజ్ చేసి కొత్తవి కొనుగోలు చేసేందుకు ఢిల్లీలోని నోయిడా, ముంబై స్టోర్ల ఎదుట కస్టమర్లు క్యూ కట్టారు. నిన్న దేశీయ మార్కెట్లో ఐఫోన్ లాంచ్ కావడంతో స్టోర్లు తెరవకముందే ఐఫోన్ ప్రియులు క్యూ కట్టారు.
అందులో కొందరిని ఇన్ ఫ్లూయెన్సర్స్ ఇంటర్వ్యూ చేయగా..షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.ఓ వ్యక్తి తన వద్ద ఐఫోన్ 18 సిరీస్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో తన తాత ముత్తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన బంగారం అమ్మి లేటెస్ట్ సిరీస్ ఐఫోన్ కొని తన భార్యకు బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. మరొకరు తన భార్యకు గిఫ్టు ఇచ్చేందుకు పంజాబ్ నుంచి నోయిడాకు జర్నీ చేసినట్టు వెల్లడించారు. ఈ వీడియో ప్రసుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, నిన్న మార్కెట్లోకి విడుదలైన iPhone 18 Pro ధర రూ. 1,64,900, iPhone 18 Pro Max ధర రూ.1,79,900గా ఉంది.










