National

PetrolPumpUPI: పెట్రోల్ పంపుల్లో యూపీఐ పేమెంట్లపై డీలర్ల కీలక నిర్ణయం!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు పెట్రోల్ బంకుల్లో క్షణాల్లో యూపీఐ (UPI) ద్వారా డబ్బులు చెల్లించే సదుపాయానికి త్వరలోనే ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన ఎంపిక చేసిన డిజిటల్ వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు చేయాలని కేంద్రం నిర్ణయించడమే దీనికి కారణం. ఈ కొత్త రుసుముల విధానంపై పెట్రోల్ పంప్ డీలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

 ఈ కొత్త నిబంధనల ప్రకారం పెట్రోల్, రైల్వే, టెలికాం రంగాల్లో రూ.2,000 కంటే ఎక్కువ జరిగే ఒక్కో యూపీఐ లావాదేవీపై రూ.5ఫ్లాట్ ఎండీఆర్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సాధారణ ఇంధన విక్రయాలపై వచ్చే కమీషన్ మార్జిన్లు చాలా స్వల్పంగా ఉంటాయని, రోజువారీ నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ అదనపు ఛార్జీల భారాన్ని తాము భరించలేమని డీలర్లు తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ పంపుల్లో జరిగే డిజిటల్ లావాదేవీలకు ఎండీఆర్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

 కేంద్ర ప్రభుత్వం ఈ ఛార్జీలను ఉపసంహరించుకోకపోతే అక్టోబర్ 16వ తేదీ నుంచి రూ.2,000 దాటిన ఇంధన కొనుగోళ్లకు యూపీఐ చెల్లింపులను నిలిపివేస్తామని మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల పెట్రోల్ పంప్ యజమానులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పెద్ద మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేసే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) ఆందోళన వ్యక్తం చేసింది.

 అయితే, ఎండీఆర్ అనేది వినియోగదారుల ఖాతాల నుంచి నేరుగా కట్ అయ్యే రుసుము కాదని, వ్యాపారులే చెల్లించాల్సిన ఫీజు అని ప్రభుత్వం స్పష్టీకరించింది. అయినప్పటికీ డీలర్లు ఈ భారాన్ని మోసేందుకు సిద్ధంగా లేకపోవడంతో, సమస్య తీవ్రతరం కాకముందే ప్రభుత్వం వ్యాపారులతో చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

#PetrolPumpUPI#UPIMDRCharges#PetrolDealerProtest#DigitalPayments#PetrolDieselPrice#CAIT#UPIPayments#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి