దశాబ్దాలుగా మానవ హక్కుల కోసం పోరాడిన ఒక ప్రముఖ మహిళకు ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం లభించింది. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా న్యాయవాది నవనీతం "నవి" పిళ్లై ని వరించింది.. ఈ అవార్డు బాధితుల హక్కుల కోసం, వారికి న్యాయం జరగడంకోసం అంతర్జాతీయ స్థాయిలో ఆమె చేసిన నిరంతర కృషికి గుర్తింపుగా దక్కింది.
ఇక డర్బన్‌లోని ఒక సాధారణ తమిళ భారతీయ కుటుంబంలో నవి పిళ్లై 1941లో జన్మించారు. ఆ కాలంలో దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష ఎక్కువగా ఉండేదని, అలాంటి పరిస్థితుల్లో పెరిగిన ఆమె.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి లా లో డాక్టరేట్ సాధించిన తొలి భారత సంతతి మహిళగా నిలిచారు. ఆ తర్వాత వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుల తరఫున, జైలు శిక్ష అనుభవించిన ఖైదీల తరఫున కోర్టుల్లో ధైర్యంగా వాదించారు.
మరోవైపు న్యాయమూర్తిగా రువాండా అంతర్జాతీయ నేరాల కోర్టులో పనిచేస్తున్నప్పుడు నవి పిళ్లై ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చారు. యుద్ధ సమయంలో మహిళలపై జరిగే లైంగిక దాడిని సాధారణ నేరంగా కాకుండా, ఒక జాతిసంహార (జెనోసైడ్) చర్యగా గుర్తిస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించారు. నవనీతంఇచ్చిన తీర్పు అంతర్జాతీయ చట్టాల్లో పెద్ద మార్పు తెచ్చింది. ఆ తర్వాత ఆమె అంతర్జాతీయ నేరాల కోర్టు (ICC) న్యాయమూర్తిగా, అలాగే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా 2008 నుండి 2014 వరకు సేవలందించారు.
ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ - పాలస్తీనా ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై జరిపిన ఐరాస విచారణ కమిషన్‌కు కూడా ఆమె అధ్యక్షత వహించారు. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పాక్షికంగా విచారణ జరిపి నివేదిక సమర్పించారు. మరోవైపు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్న సమయంలో కూడా.. రాజకీయ ప్రయోజనాల కంటే మానవ హక్కులు, చట్టపాలన మాత్రమే ముఖ్యమని నిరూపించిన ఆమెకు ఈ నోబెల్ బహుమతి వరించడం ఆనందకరమైన విషయంగా భావించవచ్చు.
ఇక ఎన్నో వివక్షలకు ఎదురీదుతూ బాధితుల తరఫున ధైర్యంగా నిలబడిన నవి పిళ్లై ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. భారతీయ మూలాలు ఉండి, దక్షిణాఫ్రికాలో పెరిగి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి లభించడం మానవ హక్కుల పోరాటానికి దక్కిన గొప్ప విజయంగా పేర్కొనవచ్చని భారతీయులు అంటున్నారు..












