Hero Yash: ఒక్కో హీరో భారీ హిట్ తర్వాత ఆ వెంటనే భారీ ఫ్లాప్ పడటంతో మళ్ళీ జనాలలోకి రావాలంటే కాస్త ఇబ్బంది పడతాడు. ఇది, సహజం. ఎందుకంటే, హిట్ గురించి..కొత్తగా చేయబోతున్న సినిమా గురించి ఎవరూ అడగరు. ముందు, గత సినిమా ఫ్లాప్ ఎందుకైందనే ప్రశ్నలు లేవనెత్తుతారు. ఇలాంటి, సమయంలో హీరోలు గానీ..దర్శకుడు గానీ, హీరోయిన్స్ గానీ..తప్పించుకోవడానికి కుదరదు. ఏదో ఒకటి మేనేజ్ చేసి సమాధానం చెప్పాల్సిందే.
ఇప్పుడు, అలాంటి పరిస్థితులను కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చేలా ఉందంటున్నాయి బాలీవుడ్ మీడియాతో పాటు కన్నడ సినీ వర్గాలు. దీనికి కారణం యష్ నటించిన టాక్సిక్ సినిమాను జనాలు ఇంకా మర్చిపోలేదు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా నిర్మాతలకి తీవ్రంగా నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాను కేవిఎన్ ప్రొడక్షన్స్ తో కలిసి యష్ కూడా నిర్మించాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్ కి మొదటి షో నుంచే ఘోరమైన రివ్యూస్ వచ్చాయి.
కేజీఎఫ్ లాంటి భారీ హిట్ తర్వాత యష్ నుంచి ఎవరూ ఇలాంటి సినిమాను ఆశించరు. అంతకన్నా భారీ స్థాయి చిత్రానే కోరుకుంటారు. హెవీ కాస్టింగ్..లావిష్ మేకింగ్ తప్ప కథలో అసలు దమ్మే లేదు. ఇలాంటి సినిమా కోసం యష్ నిర్మాతగా, హీరోగా నాలుగేళ్ళు లాకయ్యాడు. తీరా చూస్తే సినిమాపై విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. అంతేకాదు, యష్ ని కూడా బాగా ట్రోల్ చేశారు. ఫ్లాప్ వల్ల యష్ అన్నీ రకాలుగా నష్టపోయాడు.
అయితే, ఆయన రావణడిగా నటిస్తోన్న రామాయణ సినిమా ఈ దీపావళికి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ఇందులో సీతారాములుగా నటిస్తున్నారు. ప్రస్తుతం, జరుగుతున్న ప్రమోషన్స్‌లో వీరిద్దరే కనిపిస్తున్నారు తప్ప యష్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఈ మూవీని దాదాపు 4 వేల కోట్లతో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. యష్ కూడా ఇందులో పార్ట్నర్. కానీ, టాక్సిక్ ప్రభావం వల్ల రామాయణ ప్రమోషన్స్‌కి రాలేకపోతున్నాడట. మరి, ఈ సినిమాతోనైనా యష్ కష్టాలతో పాటు నష్టాల నుంచి బయటపడతాడా లేదా చూడాలి.












