సినిమా

Nani-Nithin: నితిన్ కోసం రిస్క్ చేస్తున్న నాని!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Nani-Nithin: మన టాలీవుడ్ హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంటోంది. కష్టాల్లో ఉన్న అభిమానుల కోసం తరలి రావడమే కాదు..వారికి అవసరమైన ఆర్ధిక సహాయం చేస్తున్నారు. దీనికోసం ఒక హీరో ఇంకో హీరోతో మాట్లాడి ఫ్యాన్స్ ఇబ్బందులను తీర్చుతున్నారు. ఇది ఒక మానవతా దృక్పథం అయితే, తోటి హీరో ఫ్లాపుల్లో ఉంటే సినిమాను నిర్మించి ఆ హీరోను సక్సెస్ ట్రాక్ ఎక్కించడానికి పూనుకోవడం ఒక సాహసమే అనుకోవాలి.

అలాంటి, సాహసం నేచురల్ స్టార్ నాని చేస్తున్నాడు. అది, కూడా యూత్ స్టార్ నితిన్ కోసం. గత కొంత కాలంగా నితిన్ సక్సెస్ చూడలేకపోతున్నాడు. భీష్మ తర్వాత మళ్ళీ హిట్ అనేదే నితిన్ ఖాతాలో చేరలేదు. రంగ్ దే, చెక్, మాచర్ల నియోకవర్గం, తమ్ముడు..ఇలా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. దీంతో, ఎల్లమ్మ సినిమా చేయాల్సిన నితిన్ ఖాతా నుంచి ఈ సినిమా తప్పిపోయింది.

దీంతో, కాస్త డైలమాలో పడ్డాడు నితిన్. ఎలాంటి కథ ఎంచుకోవాలి..అనసవరంగా తన ఇమేజ్ కి అదిపోయే కథలు కాకుండా మాస్ అండ్ యాక్షన్ హీరో అనిపించుకోవాలనే ఆరాటంతో వరుస ఫ్లాపులను మూటగట్టుకున్నాడు. మళ్ళీ, తనకి సూటయ్యే జానర్ సినిమాను చేస్తున్నాడు. అయితే, ఇక్కడ మెచ్చుకోవాల్సింది హీరో నాని ని. ఆయన సమర్పణలో దీప్తి గంటా నిర్మాతగా యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నానికి కథల మంచి పట్టుంది. ఏ హీరో ఎలాంటి కథ చేస్తే హిట్ అవుతుంది..ఏ కథకి ఎంత బడ్జెట్ పెట్టాలి..అనే విషయాల మీద మంచి అవగాహన ఉంది. అందుకే, దండోరా ఫేమ్ మురళి కాంత్ దేవాసోత్ చెప్పిన కథ నితిన్‌కి బాగా సూటవుతుందని నాని స్వయంగా నిర్మిస్తున్నాడు. గత కొంతకాలంగా నితిన్ కి సక్సెస్‌లు లేక మార్కెట్ బాగా తగ్గింది. ఇలాంటి, సమయంలో నితిన్ కోసం నాని రంగంలోకి దిగడం గొప్ప విషయం. ఇక, ఈ సినిమా అలియాస్ రుక్మిణి పేరుతో తెరకెక్కుతోంది. హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య నటిస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాను డిసెంబర్ 4న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

#Alias Rukmini#Nani#Nithin#Tollywood#Latest Cinema News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి