National

Supreme Court: సీజేపీ ధర్నా కోసం మెట్రోలను ఆపొద్దు.. కేంద్రానికి ‘సుప్రీం’ ఆదేశం!

రచన: Mahesh•••5 నిమిషాల పఠనం

Supreme Court: ఢిల్లీలో ఎవరైనా ధర్నాకు పిలుపునిస్తే చాలు.. రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తూ సామాన్య ప్రజలను నడిరోడ్డుపై నిలబెట్టే పద్ధతిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనల సాకుతో ఏకంగా 57 మెట్రో స్టేషన్లు, రైలు సర్వీసులను క్లోజ్ చేయాలన్న కేంద్రం నిర్ణయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, వెంటనే ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని మోడీ సర్కార్‌ను ఆదేశించింది.

Supreme Court: ఢిల్లీలో ఎవరైనా ధర్నాకు పిలుపునిస్తే చాలు.. రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తూ సామాన్య ప్రజలను నడిరోడ్డుపై నిలబెట్టే పద్ధతిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనల సాకుతో ఏకంగా 57 మెట్రో స్టేషన్లు, రైలు సర్వీసులను క్లోజ్ చేయాలన్న కేంద్రం నిర్ణయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, వెంటనే ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని మోడీ సర్కార్‌ను ఆదేశించింది.

57 మెట్రో స్టేషన్ల బంద్..

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో అక్టోబర్ 10న నిరసన కార్యక్రమం జరగనుంది. దీనిని అడ్డుకునేందుకు, ముందుజాగ్రత్త చర్యల పేరుతో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచే ఏకంగా 57 మెట్రో స్టేషన్లను, పరిసర ప్రాంతాల్లోని రైల్వే సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆంక్షలు శనివారం రోజంతా అమల్లో ఉంటాయని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది.

ప్రజా రవాణాను ఎలా స్తంభింపజేస్తారు?

ఆందోళనలు జరుగుతున్నంత మాత్రాన మొత్తం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎలా నిలిపివేస్తారని ధర్మాసనం నిలదీసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గురుగ్రామ్, ఈస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీలతో పాటు రాజధాని పరిసర ప్రాంతాల నుంచి నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులు నరకం చూస్తారని హెచ్చరించింది. పౌరుల భద్రత ఎంత ముఖ్యమో.. సామాన్యుల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేసింది. మెట్రోలను పూర్తిగా క్లోజ్ చేయడానికి బదులు ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. కోర్టు వ్యాఖ్యలపై స్పందించిన సొలిసిటర్ జనరల్.. ఈ వ్యవహారంపై కేంద్రంతో వెంటనే చర్చించి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వేరే వేదికలు చూడండి

విచారణ సందర్భంగా నిరసనలకు వేదికగా మారుతున్న జంతర్ మంతర్ పరిసరాలపైనా సర్వోన్నత న్యాయస్థానం కీలక కామెంట్స్ చేసింది. జంతర్ మంతర్ చాలా ఇరుకైన ప్రాంతమని, అక్కడ ఆందోళనలు చేపడితే నిరసనకారులకే కాకుండా సాధారణ ప్రజలకూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది. అక్కడ ధర్నాలు జరిగినప్పుడు ఆహారం, కనీస పారిశుధ్య వసతులు కూడా అందుబాటులో లేకుండా పోవడంతో పాటు, ఎమర్జెన్సీ టైంలో అంబులెన్సులు రావడానికి కూడా దారి ఉండటం లేదని గుర్తుచేసింది. ఇలాంటి కారణాలతో ఇకనైనా నిరసనలు, ధర్నాల కోసం జంతర్ మంతర్‌కు బదులుగా విశాలమైన ప్రత్యామ్నాయ వేదికలను రెడీ చేయాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

#Supreme Court#Supreme Court of India#Delhi Metro#Delhi Metro Stations#swechaaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి