తెలంగాణ

TG: తెలంగాణలో డిజిటల్ విప్లవం దిశగా తపాలా శాఖ: సీపీఎంజీ డీఎస్‌వీఆర్ మూర్తి

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

TG: ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 15 వరకు జాతీయ తపాలా వారోత్సవాలను నిర్వహిస్తున్నామని, ‘‘ఒకే తపాలా వ్యవస్థ - అపరిమిత అవకాశాలు’’ అనే నినాదంతో టెక్నాలజీ ఆధారిత సేవలను విస్తరిస్తున్నామని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ (సీపీఎంజీ) డీఎస్‌వీఆర్ మూర్తి వెల్లడించారు.

TG: ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 15 వరకు జాతీయ తపాలా వారోత్సవాలను నిర్వహిస్తున్నామని, ‘‘ఒకే తపాలా వ్యవస్థ - అపరిమిత అవకాశాలు’’ అనే నినాదంతో టెక్నాలజీ ఆధారిత సేవలను విస్తరిస్తున్నామని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ (సీపీఎంజీ) డీఎస్‌వీఆర్ మూర్తి వెల్లడించారు. హైదరాబాద్‌లోని డాక్ సదన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 6,219 తపాలా కార్యాలయాలు, 17,137 మంది సిబ్బందితో నిరంతర సేవలు అందిస్తున్నామని తెలిపారు. రోజ్‌గార్ మేళా ద్వారా తెలంగాణ సర్కిల్‌లో 1,123 మంది జీడీఎస్‌లతో కలిపి మొత్తం 1,272 మందికి నియామక పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు.

సాంకేతిక మార్పుల్లో భాగంగా ఐఐటీ హైదరాబాద్, ఇస్రో సహకారంతో 10 అక్షరాల జియో-కోడెడ్ ‘డిజిపిన్’, స్వదేశీ ఏపీటీ 2.0 వేదికలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. హైదరాబాద్‌లోని 94 పిన్‌కోడ్లలో ప్రవేశపెట్టిన 24 & 48 గంటల స్పీడ్ పోస్ట్ సేవలతో ఇప్పటికే 1.33 లక్షల వస్తువులను బట్వాడా చేశామని, కౌంటర్లలో యూపీఐ, కార్డులతో పాటు డోర్‌స్టెప్ సర్వీస్‌లో సీవోడీ విధానం అమలు చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలోని 14 పోస్టాఫీసు పాస్‌పోర్ట్ కేంద్రాలు, 263 ఆధార్ కేంద్రాల ద్వారా లక్షలాది మందికి పౌర సేవలు అందుతున్నాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ప్రతి నెలా దాదాపు 20 లక్షల మంది చేయూత లబ్ధిదారులకు సుమారు రూ.500 కోట్ల పింఛన్లను నేరుగా పంపిణీ చేస్తున్నామని, స్త్రీనిధి రుణాలతో పాటు ఆలయ ప్రసాదాలను భక్తుల ఇళ్లకు చేరవేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం సర్కిల్ పరిధిలో 1.07 కోట్ల పొదుపు అకౌంట్లు ఉండగా, వచ్చే ఏడాది నాటికి 25 శాతం గ్రామీణ జనాభాను ఆర్థిక సమ్మిళిత్వంలోకి తీసుకురావడమే టార్గెట్‌గా పెట్టుకున్నామని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 71,233 పాలసీల ద్వారా రూ.590.13 కోట్ల బీమా ప్రీమియం వసూలు చేసి, రూ.596.71 కోట్ల ఆదాయంతో రికార్డ్ సృష్టించామని, ప్రస్తుత ఏడాది సెప్టెంబర్ నాటికి ఇప్పటికే రూ.322.28 కోట్ల రాబడి నమోదైందని ఆయన చెప్పారు.

#Telangana#TG News#India Post#Telangana Postal Department#Postal Department#swechaaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి