సినిమా

Prabhas: ఈసారి ట్రోలర్స్‌కి నో ఛాన్స్?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Prabhas: బిగ్ స్టార్ నటించే చాలా సినిమాలకి డూప్స్ అవసరం అవుతుంటారు. ఇది, ఇప్పుడు జరుగుతున్న తంతేమీ కాదు. ఎప్పటి నుంచో ఉంది. హీరో పాత్ర గనక రెండు విభిన్నమైనవిగా ఉంటే ఒకేసారి ఇద్దరూ స్క్రీన్ మీద కనిపించాల్సి వస్తే అప్పుడు ఒకరు రియల్ ఇంకొకరు డూప్‌గా ఉంటారు. అంతేకాదు, భారీ యాక్షన్ సీన్స్ తీసేటప్పుడు..ఫైట్స్ చేసేటప్పుడు..ఎత్తైన కొండల నుంచి దూకేటప్పుడు..చాలా వరకూ డూప్‌లతోనే లాగించేస్తారు.

Prabhas: బిగ్ స్టార్ నటించే చాలా సినిమాలకి డూప్స్ అవసరం అవుతుంటారు. ఇది, ఇప్పుడు జరుగుతున్న తంతేమీ కాదు. ఎప్పటి నుంచో ఉంది. హీరో పాత్ర గనక రెండు విభిన్నమైనవిగా ఉంటే ఒకేసారి ఇద్దరూ స్క్రీన్ మీద కనిపించాల్సి వస్తే అప్పుడు ఒకరు రియల్ ఇంకొకరు డూప్‌గా ఉంటారు. అంతేకాదు, భారీ యాక్షన్ సీన్స్ తీసేటప్పుడు..ఫైట్స్ చేసేటప్పుడు..ఎత్తైన కొండల నుంచి దూకేటప్పుడు..చాలా వరకూ డూప్‌లతోనే లాగించేస్తారు. ఈ విషయంలో ఇటీవల బాగా ట్రోల్స్‌కి గురైంది ప్రభాస్. కానీ, ఫౌజీ(Fauzi) సినిమాకి ఆ ఛాన్స్ ఇవ్వడట.

బాహుబలి(Bahubali) సినిమా రెండు భాగాలలో ప్రభాస్(Prabhas) కి డూప్ గా ఒక వ్యక్తి నటించాడు. కొన్ని చోట్ల చాలా స్పష్టంగా ఇది తెలుస్తుంది కూడా. ముఖ్యంగా, బాహుబలి 2లో చిన్న బండరాయిని తగిలి పడిపోయే సీన్ లో ప్రభాస్ డూప్‌నే చూపిస్తారు. ఇక్కడ చాలా క్లియర్‌గా అది ప్రభాస్ కాదని తెలుస్తుంది. ఇలా, ఈ మధ్య స్టంట్స్ చేసిన సమయంలో ప్రభాస్ కి డూప్‌నే పెట్టారు. అందుకే, ఎక్కువగా ప్రభాస్‌ని కొందరు నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తుంటారు.

కానీ, ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమాలు స్పిరిట్, ఫౌజీ సినిమాలకి మాత్రం డూప్ లేకుండా స్వయంగా ప్రభాస్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో పాల్గొన్నాడట. ముఖ్యంగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్, ఇమాన్వి జంటగా నటిస్తోన్న ఫౌజీ సినిమాలో ఉన్న అన్నీ యాక్షన్ సీన్స్‌లో, స్టంట్స్‌లో ప్రభాస్‌కి డూప్‌గా ఎవరూ లేరని స్వయంగా నిర్మాతే క్లారిటీ ఇచ్చాడు. ఈసారి ప్రభాస్ ఆ ఛాన్స్ ఇవ్వలేదని వెల్లడించాడు.

వాస్తవానికి, క్లోజప్ లో మాత్రమే ప్రభాస్ కనిపిస్తాడు. లాంగ్ షాట్స్ లో చాలా వరకూ డూప్‌నే పెడుతున్నారు. మోకాలికి జరిగిన సర్జరీ తో పాటు ఇతర కారణాల వల్ల ఇలా డూప్‌తో కొన్ని ఫైట్ సీక్వెన్సెస్‌ని మేనేజ్ చేయాల్సి వస్తుంది. కానీ, రియల్ గా ఫౌజీలో ఉన్న భారీ ఫైట్స్ అన్నీ ప్రభాస్ చేశాడట. ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అనుకున్న ఫౌజీ..పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ, కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. కానీ, ఫిల్మ్ సర్కిల్స్‌లో మాత్రం మార్చి 18న ఫౌజీ వస్తుందనే మాట వినిపిస్తోంది.

#Prabhas#Hanu Raghavapudi#Fauzi#Imanvi#Mythri Movie Makers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి